వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఐదేళ్లు ఎల్టీటీఈ బ్యాన్ : గెజిట్ విడుల చేసిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : తమిళ వేర్పాటువాద సంస్థ లిబరేషన్‌ ఆఫ్‌ తమిళ్‌ టైగర్స్‌ ఈలం (ఎల్‌టీటీఈ)పై మరో ఐదేళ్లు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇష్యూ చేసింది.

రాజీవ్ హత్య తర్వాత బ్యాన్ ...
దివంగత ప్రధాని రాజీవ్ హత్య తర్వాత ఎల్టీటీఈపై తొలిసారి నిషేధం విధించింది. ఆ తర్వాత దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని .. ప్రజల భద్రతకు ముప్పు ఉన్నందున నిషేధం విధిస్తున్నట్టు గెజిట్ లో కేంద్రం పేర్కొన్నది. అంతేకాదు చట్ట వ్యతిరే కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థగా కొనసాగించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. అంతేకాదు సామాజిక మాధ్యమాల ద్వారా ఎల్టీటీఈ తన లక్ష్యాలను ప్రచారం చేస్తుందని వెల్లడించింది. వ్యాసాలు, రచనలను వ్యాప్తి చేస్తూ ప్రజల భద్రతకు పెనుముప్పుగా మారిందని గుర్తుచేసింది. అంతేకాదు దీంతో శ్రీలంక తమిళుల దృష్టిలో భారత్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయపడింది.

another five years ltte ban

తప్పడు వార్తలు ప్రచారం
శ్రీలంక ప్రభుత్వమే ఎల్టీటీఈ చేస్తున్న పోరాటానికి భారత ప్రభుత్వమే కారణమేన తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టింది. వారు చేపట్టే చర్యల వల్ల దేశంలోని ప్రముఖుల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2009లో శ్రీలంక ప్రభుత్వం ఎల్టీటీఈని పూర్తిగా మట్టుబెట్టినప్పటీకి ప్రత్యేక తమిళ రాజ్యం వాదన మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఈ క్రమంలో చెల్లాచెదురైన సంస్థ సానుభూతిపరులు, కార్యకర్తలను మళ్లీ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తుందని గెజిట్ లో పేర్కొన్నది. శ్రీలంక తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో తమిళులకు స్వతంత్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో 1976లో ఎల్టీటీఈ ఏర్పడింది. అయితే 2009లో శ్రీలంక సైన్యం చేతిలో ఆ సంస్థ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

English summary
Tamil separatist organization Liberation of Tamil Tigers has been banned for another five years. The Central Government has issued orders. Union Home Gazette Notification has also issued a notice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X