వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్జల్‌గురుపై వ్యాఖ్య: బీజేపీకి పీడీపీ చుక్కలు, అప్పుడే.. ముసలం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్తాన్, తీవ్రవాదులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ పొగడి బీజేపీని ఇరుకున పెట్టారు. తాజాగా మరోసారి పీడీపీ అఫ్జల్ గురు పైన వ్యాఖ్యలు చేసి కమలం పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. పార్లమెంటు పైన దాడికి దిగిన అఫ్జల్ గురుకు చెందిన అస్తికలను వెనక్కి ఇవ్వాలని పీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో పీడీపీ - బీజేపీ ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన నాడే సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రశాంత ఎన్నికలకు తీవ్రవాదులు కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి పాకిస్తాన్ పైన ప్రశంసలు కురిపించారని విపక్షాలు ధ్వజమెత్తాయి. దీనిని కాంగ్రెస్ పార్టీ... లోకసభలో బీజేపీ నిలదీసింది.

ఇప్పుడు బీజేపీతో పొత్తు కలిగిన పీడీపీకి చెందిన ఎమ్మెల్యే మరో సంచలన వ్యాఖ్య చేశారు. అఫ్జల్ గురుకు ఉరివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అఫ్జల్ గురుకు చెందిన అస్తికలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బీజేపీకి రెండు రోజుల్లోనే మరో చిక్కు పడింది.

Another flashpoint: PDP MLAs say 'return mortal remains of Afzal Guru'

పాకిస్తాన్, తీవ్రవాదుల పైన తాను చేసిన వ్యాఖ్యలపైన పార్లమెంటు దద్దరిల్లినప్పటికీ ముఖ్యమంత్రి తగ్గలేదు. సరిహద్దుల్లో సైన్యం ఎప్పుడు ఉంటుందని మహ్మద్ ముఫ్తీ చెప్పారు. పాక్ పైన తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్ననని చెప్పారు. జమ్మూ సహా అన్ని సమస్యలు చర్చల ద్వారనే పరిష్కారమవుతుందని చెప్పారు. నా వ్యాఖ్యలపై మీడియా రాద్దాంతం చేస్తోంది. పాక్‌తో వాజపేయి విధానాలు కొనసాగాలని నాన్న కోరుకునే వారన్నారు.

పొత్తు.. అప్పుడే ముసలం!

జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ - పీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అంతలోనే ముసలం ఏర్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ తీరు పైన ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

English summary
The PDP has demanded the return of Afzal Guru's mortal remains, who was given death sentence for his role in December 2001 terrorist attack on Parliament, as per reports on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X