వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెఎన్‌యూలో రీసెర్చ్ స్కాలర్‌పై లైంగిక వేధింపులు, ప్రోఫెసర్‌పై కేసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:జెఎన్‌యూలో మరో ప్రోఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇప్పటికే ఎనిమిది మంది విద్యార్ధినులు తమపై ప్రోఫెసర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలతో ఆందోళన చేశారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ విషయమై విద్యార్ధులు చేసిన నిరసన కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.ఈ తరుణంలో తాజాగా మరో ఘటన వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది.

జెఎన్‌యూ ప్రోఫెసర్‌పై మహిళా పీహెచ్‌డీ స్కాలర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది వర్శిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన మరో ప్రోఫెసర్‌పై మహిళా స్కాలర్‌ను బెదిరించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 Another JNU professor booked for allegedly sexually harassing research scholar

నిందితుడిపై ఐపీసీ 354, 506, 509 సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో జెఎన్‌యూలో ఈ తరహ ఘటనలు అధికంగా వెలుగు చూస్తున్నాయి. అయితే బాధితురాలు తమను సంప్రదిస్తే ఆమెను న్యాయం జరిగేందుకు తాము సహకరిస్తామని జెఎన్‌యూ విద్యార్ధి సంఘం ప్రకటించింది.

వర్శిటీలో ఏర్పాటైన లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీకి బాధితురాలు ఇంకా ఫిర్యాదు చేయలేదు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఏబీవీపి నేత సౌరభ్ శర్మ పోలీసులను డిమాండ్ చేశారు.

English summary
The Delhi Police on Friday booked another Jawaharlal Nehru University teacher for allegedly sexually harassing and threatening a female research scholar. This is the third such case in the university in the past two months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X