బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో సంచలనం : శ్రీనివాస గౌడ రికార్డును బద్దలు కొట్టిన మరో కంబళ వీరుడు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Indian Usain Bolt Srinivasa Gowda's Record Breaks By Kambala Runner Nishant Shetty | Oneindia Telugu

వారం రోజులైనా కాలేదు కదా.. కంబళ వీరుడు శ్రీనివాస గౌడ ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలు కొట్టాడన్న వార్త వెలుగుచూసి. అప్పుడే మరో సంచలన రికార్డు నమోదైంది. ఈసారి శ్రీనివాస గౌడ రికార్డును మరో కంబళ వీరుడు నిశాంత్ శెట్టి బద్దలుకొట్టాడు. కేవలం 9.51 సెకన్లలో 100మీ. దూరం పరిగెత్తాడు. మొత్తంగా 13.68సెకన్లలో 143మీ. లక్ష్యాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు శ్రీనివాస గౌడ 9.55 సెకన్లలో 100మీ. దూరాన్ని పరిగెత్తాడు. మొత్తంగా 13.36 సెకన్లలో 142.50మీ. దూరాన్ని పరిగెత్తాడు. కర్ణాటకలోని బజగోలి జోగిబెట్టుకు చెందిన నిశాంత్ శెట్టి వేనూరులో నిర్వహించిన కంబళ పోటీల్లో తాజా రికార్డు నెలకొల్పాడు.

కాగా,కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విధానసౌదలో శ్రీనివాస గౌడను సన్మానించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI)ట్రయల్స్ ఆహ్వానాన్ని తిరస్కరించి గౌడ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇలా పరిగెత్తుతాని తానే ఊహించలేదని.. సింథటిక్ ట్రాక్‌పై షూస్‌తో అదే వేగంతో పరిగెత్తడం కష్టమని పేర్కొన్నాడు. అయితే తనను రప్పించడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నం చేస్తామని శాయ్ సీనియర్ డైరెక్టర్ అజయ్ కుమార్ తెలిపారు.

Another Kambala runner Nishant Shetty breaks Srinivas Gowda record

మొదట అతన్ని గ్రామీణ సాంప్రదాయ రన్నింగ్ నుంచి ట్రాక్స్‌పై పరిగెత్తించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు అతను ఎప్పుడూ షూస్ వేసుకోలేదని.. కాబట్టి రన్నింగ్ షూస్‌తో ట్రాక్‌పై పరిగెత్తడానికి శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం అతనికి అవసరమైన న్యూట్రిషన్,డైట్ అందించాలన్నారు. శ్రీనివాస గౌడ ఎప్పుడు సిద్దమైతే అప్పుడు అతనికి శిక్షణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

English summary
Another Kambala runner Nishant Shetty recorded 143m in 13.68 seconds. If calculated for 100m he clocks it in 9.51 seconds. His speed is faster than Srinivasa Gowda who recently clocked 9.55 seconds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X