బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు సెంట్రల్ జైల్లో మహిళా ఉద్యోగితో జల్సా: లేడీ టెక్కీ రేప్, హత్య కేసు నిందితుడు !

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అక్రమాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పలేక కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అక్రమాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పలేక కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టెక్కీ మీద అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన నిందితుడు దర్జాగా జైల్లోనే మహిళా పిబ్బందితో కాపురం పెట్టేశాడని బుధవారం వెలుగు చూసింది.

లేడీ టెక్కీ ప్రతిభా (28) మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కామాంధుడు శివకుమార్ ఇప్పుడు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉద్యోగం చేస్తున్న మహిళా హోం గార్డుతో జల్సా చేస్తున్నాడు. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఓ ఫోటో బుధవారం వెలుగులోకి వచ్చింది.

 Another Karmakanda of Bengaluru Parappan Agrahara Prisoner

అనారోగ్యంగా ఉందని జైళ్ల శాఖ అధికారులను నమ్మిస్తున్న శివకుమార్ లేడీ హోం గార్డెన్ వెంట పెట్టుకుని తిరుగుతూ జల్సా చేస్తున్నాడని వెలుగు చూసింది. ఈ విషయంపై బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు మాత్రం ఏ విధంగా స్పందించకుండా మౌనంగా ఉన్నారు.

శివకుమార్ కారు డ్రైవర్ గా పని చేసేశాడు. 2005లో బెంగళూరు నగరంలోని హెచ్ పీ కంపెనీ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రతిభా (28) నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేస్తూ శివకుమార్ క్యాబ్ లో బయలుదేరింది. మార్గం మధ్యలో ప్రతిభా మీద అత్యాచారం చేసిన శివకుమార్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు శివకుమార్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ఇటీవల బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు చిన్నమ్మ శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని డీజీపీ రూపా ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సిబ్బంది, అత్యాచారం, హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ లవ్ స్టోరీ బయటకు వచ్చింది.

English summary
Another Karmakanda of Bengaluru Parappan Agrahara Prisoner in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X