వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మక్కా వెళ్లిన కర్ణాటక వ్యక్తి కరోనాతో మృతి, మృతుడి బంధువుకు వైరస్, ఆనలుగురుకి పరీక్షలు, మంత్రి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కలబురిగి: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాధి (COVID 19) భారత్ లోని పలు రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. కర్ణాటకలోని కలబురిగిలో ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధితో ఒకరు మరణించారు. మరణించిన వ్యక్తి బంధువులు ముగ్గురికి ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధి సోకిందని అనుమానాలు వ్యక్తం కావడంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తి బంధువు (మహిళ)కు కరోనా వైరస్ సోకిందని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని మంత్రి బళ్లారి శ్రీరాములు హామీ ఇచ్చారు.

Coronavirus Patient:బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ, ఉద్యోగుల క్షేమం!Coronavirus Patient:బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ, ఉద్యోగుల క్షేమం!

మక్కా యాత్రకు వెళ్లి కరోనాతో రిటన్ !

మక్కా యాత్రకు వెళ్లి కరోనాతో రిటన్ !

కర్ణాటకలోని కలబురిగికి చెందిన మహమ్మద్ హుసేన్ సిద్దిఖీ కొంత కాలం క్రితం మక్కా యాత్రకు వెళ్లి వచ్చారు. మక్కా యాత్రకు వెళ్లిన మహమ్మద్ హుసేన్ సిద్దిఖీకి కరోనా వైరస్ వ్యాధి సోకడంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. కరోనా వైరస్ వ్యాధితో చికిత్స విఫలమై మరణించిన మహమ్మద్ హుసేన్ సిద్దిఖీ బంధువుకు కరోనా వైరస్ వ్యాధి సోకడంతో కర్ణాటక ప్రభుత్వం హడలిపోయింది.

నలుగురికి కరోనా పరీక్షలు, మహిళకు !

నలుగురికి కరోనా పరీక్షలు, మహిళకు !

కరోనా వైరస్ వ్యాధితో మరణించిన మహమ్మద్ హుసేన్ సిద్దికి బంధువులు నలుగురికి కరోనా వైరస్ సోకిందని అనుమానం రావడంతో వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే వారిలో ముగ్గురికి కరోనా వైరస్ వ్యాధి లేదని వైద్యపరీక్షల్లో స్పష్టం అయ్యింది. అయితే మహమ్మద్ హుసేన్ సిద్దిఖీ బంధువు అయిన 45 ఏళ్ల మహిళకు కరోనా వైరస్ వ్యాధి సోకిందని ఆదివారం వైద్య పరీక్షల్లో వెలుగు చూసింది.

స్పెషల్ వార్డులో కరోనా మహిళ

స్పెషల్ వార్డులో కరోనా మహిళ

కరోనా వైరస్ వ్యాధితో మరణించిన మహమ్మద్ హుసేన్ సిద్దిఖీ బంధువులు నలుగురికి ప్రత్యేక వార్డులో చికిత్స చేశారు. నలుగురిలో ముగ్గురికి కరోనా వైరస్ వ్యాధి వ్యాపించలేదని వెలుగు చూసింది. అయితే ఓ మహిళకు కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స చేయిస్తున్నామని, స్థానిక ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు హామీ ఇచ్చారు.

కరోనా దెబ్బతో రంగంలోకి దిగిన మంత్రి

కరోనా దెబ్బతో రంగంలోకి దిగిన మంత్రి

కలబురిగిలో నలుగురికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని అనుమానాలు రావడంతో కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు రంగంలోకి దిగారు. కలబురిగిలోని జిమ్స్ ఆసుపత్రికి స్వయంగా భేటీ అయిన మంత్రి బళ్లారి శ్రీరాములు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటూ వైద్యులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.

కరోనా వైరస్ మహిళ పరిస్థితి !

కరోనా వైరస్ మహిళ పరిస్థితి !

కరోనా వైరస్ వ్యాధితో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న మహిళ వివరాలు సేకరించిన మంత్రి బళ్లారి శ్రీరాములు ఆమెకు ఎలాంటి వైద్య చికిత్స అందిస్తున్నారు ?, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అంటూ అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధి అరికట్టానికి అవసరమైన 80 కిట్లు ఇచ్చామని, మరో 500 కిట్ లు త్వరలో అందిస్తామని మంత్రి బళ్లారి శ్రీరాములు తెలిపారు.

English summary
Another Person Get Coronavirus (COVID 19) Positive Case Found At Kalburgi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X