వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరవ్ మోడీ ఫ్రాడ్: మరో పిఎన్బీ అధికారి అరెస్టు, పత్రాల స్వాధీనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

PNB-Nirav Modi Fraud : CBI Recovered Documents

ముంబై: నీరవ్ మోడీ అక్రమాల కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)కి చెందిన మరో అధికారిని గురువారం అరెస్టు చేశారు. ముంబైలోని చాల్ నుంచి లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్‌కు చెందిన పత్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

రెండు బిలియన్ అమెరికా డాలర్ల అక్రమాలకు సంబంధించి దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బిష్ణుభ్రత మిశ్రా అనే రిటైర్డ్ ఇంటర్నల్ చీఫ్ ఆడిటర్‌ను అరెస్టు చేశారు పిఎన్‌బి హౌస్ బ్రాంచ్‌లో 2011 - 2015కు సంబంధించిన ఆడిట్ వ్యవహారాలను ఆయనే చూశారు.

Another PNB executive held, LoU documents recovered from Mumbai chawl

సిబిఐ కస్టడీలో ఉన్నవారినే కాకుండా మరో 13 మందిని కూడా సిబిఐ అధికారులు గురువారంనాడు ప్రశ్నించారు. అరెస్టయినవారితో పాటు ఇతరులను ప్రశ్నించినప్పుడు వెలువడిన సమాచారం మేరకు మరిన్ని సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ముంబైలోని వాడాల చాల్‌లోని ఓ చిన్న గదిలో పత్రాలను దాచి పెట్టారు అది నీరవ్ మోడీకి చెందిందని భావిస్తున్నారు. అయితే, అది అతని కంపెనీ పేరు మీద లేదు. తన వ్యాపార కార్యకలాపాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు నీరవ్ మోడీ చెప్పారు.

English summary
The CBI on Thursday arrested another senior executive of the Punjab National Bank and claimed to have recovered documents related to Letter of Undertaking from 'chawl' as it continued its searches in connection with the USD 2 billion fraud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X