వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్యానాలో మరో రేప్: ఇంట్లోకి వెళ్లి యువతిపై గ్యాంగ్‌రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

ఫతేబాద్: హర్యానాలో మరో అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. మహిళలపై అత్యాచారాలు పెరుగుతూ పరిస్థితి చేయి దాటిపోతున్న స్థితిలో మరో అత్యాచారం కేసు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

ఫతేబాదులని భూటాన్ గ్రామంలో 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు వ్యక్తులు బుధవారం అత్యాచారం చేశారు. ఇంట్లో తనపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి పంపించారు.

కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్: పెట్రోల్ పంప్ పక్కన పడేసి పరారీకదులుతున్న కారులో గ్యాంగ్ రేప్: పెట్రోల్ పంప్ పక్కన పడేసి పరారీ

Another rape case in Haryana, 20-year-old gangraped at home

Recommended Video

దళిత బాలికపై రేప్.. ఆపై హత్య !

నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేస్తాని, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఫతేబాదు మహిళా పోలీసు స్టేషన్ అధికారి బిమలా దేవి చెప్పారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యాచారాలు, హత్యలు జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ముగ్గురు ఐజి స్థాయి అధికారులను, ఓ ఎస్‌హెచ్ఓను బదిలీ చేశారు.

దళిత బాలికపై రేప్, హత్య: లోనికి చొప్పించి, ఆపై హత్యదళిత బాలికపై రేప్, హత్య: లోనికి చొప్పించి, ఆపై హత్య

ఇటువంటి సంఘటనలు దురదృష్టకరమని, కఠిన చర్యలు తీసుకుంటామని, లొసుగులను సరి చేస్తామని, పోలీసు పాలనాయంత్రాంగంలో మార్పులు చేశామని, కొంత మంది అధికారులను బదిలీ చేశామని ముఖ్యమంత్రి చెప్పారు

మహిళల రక్షణకు తాము పలు చర్యలు తీసుకున్నామని, డయల్ 100 ప్రాజెక్టును ప్రారంభించామని, ప్రమాదంలో ఉన్న మహిళలు సంప్రదించడానికి 1090 ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. ఆ విధమైన కేసుల పరిష్కారం త్వరగా జరిగేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామన అన్నారు.

English summary
A 20-year-old woman was allegedly gangraped in Bhuthan village in Fatehabad while she was alone in her house on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X