వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవ్ జిహాద్‌లో కరీనా కపూర్: మోడీని వెంటాడుతున్న ఘర్ వాపసీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని కొందరు ఇరుకున పడేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ అంశం బీజేపీకి ఇబ్బందికర పరిణామమంటున్నారు. విశ్వహిందూ పరిషత్ లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కరీనా కపూర్ మార్ఫింగ్ ఫోటోను పత్రిక కవర్ పేజీ పైన ముద్రించిన విషయం తెలిసిందే.

ఇది మీడియాలో ఆసక్తిర అంశంగా మారింది. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా దానిని ముద్రించారు. దీని పైన కరీనా కపూర్ ఇప్పటి వరకు స్పందించనప్పటికీ, వీహెచ్‌పీ మాత్రం కరీనా కోర్టుకు వెళ్లవచ్చునని చెబుతున్నాయి. కవర్ పేజీ పైన కరీనా కపూర్ ఫోటోను ముద్రించడాన్ని ఆమె భర్త సైఫ్ అలీఖాన్ ఖండించినట్లుగా తెలుస్తోంది.

ఇలాంటి సంఘటనలు... బీజేపీ, మోడీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వాటిని ఫోకస్ చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు. ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, కానీ, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయా ఆంశాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడుతోందనే అంటున్నారు.

Another salvo at Modi Govt: Now VHP uses Kareena Kapoor's photo to spread 'love Jihad' campaign

బీజేపీ ఎంపీ సాక్షి సింగ్ మహారాజ్ ప్రకటన పైన విపక్షాలు తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నాయి. దీని పైన ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని పట్టుబట్టాయి. బీజేపీ, ఆ పార్టీ అధ్యక్షులు సాక్షి సింగ్ ప్రకటన నుండి తప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. కానీ, సాక్షి సింగ్ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, అవసరమైతే ఉరికి సిద్ధమంటున్నారు.

గతంలో కేంద్రమంత్రులు, ఎంపీలు పలు వ్యాఖ్యలు చేశారు. వాటి పైన ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మోడీ వివరణ ఇవ్వాలని పట్టుబట్టాయి. కానీ ఆయన మాత్రం పెదవి విప్పలేదు. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ లేదా మోడీ సమర్థించడం లేదు. మోడీ లేదా పార్టీ సీనియర్లు ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అంతేకాదు, మోడీ వారికి హితబోధ కూడా చేస్తున్నారు.

బీజేపీ నేతల వ్యాఖ్యలతో పాటు ఘర్ వాపసీ వంటి కార్యక్రమాలు మోడీకి ఇబ్బందికర పరిణామాలు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించడం లేదు. ఎన్నో ఏళ్లుగా బలవంతంగా లేదా మరో పద్ధతిలో మతమార్పిళ్లు జరుగుతుంటే స్పందించని విపక్షాలు ఇప్పుడు ఘర్ వాపసీ పైన మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెబుతున్నారు.

మత మార్పిళ్ల నిరోద చట్టం తీసుకు వద్దామంటే విపక్షాలు ముందుకు రావడం లేదని, అప్పుడే వారి ద్వంద్వ వైఖరి అర్థమవుతోందని బీజేపీ అంటోంది. అయితే, విపక్షాలు వీటి ఆధారంగా బీజేపీని లేదా మోడీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

English summary
At a time when incumbent Government is already under fire for not speaking openly against fringe elements for their loose canon approach, this news will further invite criticism from various quarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X