వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలోకి మరో ఎమ్మెల్యే .. కౌన్సిలర్లు కూడా ...?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఆ పార్టీ నేతలు షాకిస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయనతోపాటు మరో 18 మంది కౌన్సిలర్లు కూడా బీజేపీలో చేరబోతున్నారు. తామే కాదు .. మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరతారని చెప్పారు ఎమ్మెల్యే విల్సన్ ఛాంప్రామరీ.

కాషాయ కండువా ...
అలిపూర్‌దర్ కల్చిని నియోజకవర్గ టీఎంసీ ఎమ్మెల్యే విల్సన్. ఆయనతోపాటు మరో 18 మంది టీఎంసీ కార్యకర్తలు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కమల కండువా కప్పుకోనున్నారు. మిగతా నేతలు కూడా బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారని ... వారి చేరికలు కూడా ఉంటాయని పేర్కొన్నారు విల్సన్. ఇటీవల టీఎంసీ నుంచి బీజేపీలో చేరికల పర్వం పెరిగిపోయాయి.

Another TMC MLA to join BJP, says 18 councillors too switching party

మారిని సిచుయేషన్
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ 18 సీట్లు గెలవడంతో ... రాష్ట్రంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాదు బీజేపీ ఓటు షేర్ కూడా 40 శాతానికి చేరింది. అధికార టీఎంసీ మాత్రం 37 శాతంతో సరిపెట్టుకుంది. బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్ ఆధ్వర్యంలో చేరికల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు, పదుల సంఖ్యలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ జాబితాలో మరో ఎమ్మెల్యే .. కౌన్సిలర్లు కూడా చేరిపోనున్నారు. బెంగాల్ గడ్డలో బీజేపీ సీట్లు సాధించడంతో ... ఇటీవల టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ కొనసాగి .. దాదాపు 10 మంది వరకు చనిపోయిన సంగతి తెలిసిందే.

English summary
Trinamool Congress MLA is preparing to join to the Bharatiya Janata Party, the latest in a series of defections that have taken place in West Bengal in the last few weeks. Wilson Champramary, TMC MLA from Alipurduar's Kalchini constituency, told the media he, along with 18 councillors of the party are preparing to join the BJP today. "Many more will join BJP and are in contact with party high command," Champramary said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X