వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్యానాలో మరో విషాదం: బోరుబావిలో పడి ఐదేళ్ల చిన్నారి మృతి

|
Google Oneindia TeluguNews

హర్యానా: తమిళనాడులో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడి మృతి చెందిన ఘటన మరువక ముందే హర్యానాలో అదే బోరుబావి మరో ఐదేళ్ల చిన్నారిని బలిగొంది. కర్నాల్ నియోజకవర్గంం హరిసింగ్‌పూర్ గ్రామంలో ఐదేళ్ల చిన్నారి ఆదివారం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపటికి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారి కోసం వెతికారు. అయినప్పటికీ దొరక్క పోవడంతో వారికి అనుమానం వచ్చి సమీపంలో ఉన్న బోరుబావి దగ్గరకు వెళ్లి చూశారు. బోరుబావిలో చిన్నారి పడిందని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.

బోరుబావిలో పడ్డ రెండేళ్ల సుజిత్ కన్నుమూత: కుళ్లిన స్థితిలో..!బోరుబావిలో పడ్డ రెండేళ్ల సుజిత్ కన్నుమూత: కుళ్లిన స్థితిలో..!

50 అడుగుల బోరుబావిలోకి ఈ చిన్న పాప ఆడుకుంటూ పడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. దాదాపు 10 గంటల పాటు కష్టపడ్డ సిబ్బంది సోమవారం ఉదయం బిడ్డను బయటకు తీశారు. వెంటనే కర్నాల్‌లోని హాస్పిటల్‌కు చిన్నారిని తరలించగా అప్పటికే ఆ బిడ్డ మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు.

Another tragedy in Haryana:Girl dies after falling into a 50 feet borewell

గ్రామస్తులు తమకు సమాచారం ఇవ్వగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి సమయానికి హరిసింగ్‌పూర్ గ్రామానికి చేరుకున్నారని కర్నాల్ జిల్లా ఎస్పీ సురేందర్ సింగ్ భోరియా చెప్పారు. వెంటనే బోరుబావిలోకి ఆక్సిజన్‌ పంపారని చిన్నారి కదలికలను కెమెరా ద్వారా పర్యవేక్షించారచి ఎస్పీ చెప్పారు.

ఇక 10 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకువచ్చిందని వెంటనే హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే బోరుబావిని తవ్వి దాన్ని కప్పడం మరిచిపోయిన తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గరుండా ఎమ్మెల్యే హర్విందర్ కల్యాణ్. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ శాయశక్తుల కృషి చేసి తక్కువ సమయంలోనే చిన్నారిని బయటకు తీసిందని చెప్పిన ఎమ్మెల్యే కల్యాణ్.. బోరుబావిని మూయకుండా అలానే తెరిచి పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
A 5-year-old girl died a day after falling into a borewell in Karnal’s Harisinghpura village on Monday morning. The girl was pulled out by the NDRF team after a 10-hour long rescue operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X