వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ బిల్లు: రాజ్యసభలో ప్రతిపాదనకు అన్సారీ అభ్యంతరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hamid Ansari
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు మంగళవారం రాజ్యసభకు రావడం లేదు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ తెలంగాణ బిల్లును ముందుగా రాజ్యసభలో చేపట్టడంపై అభ్యంతరాలు లేవనెత్తారు. హమీద్ అన్సారీ అనుమానాల నివృత్తి కోసం తెలలంగాణ బిల్లును న్యాయ శాఖ సలహా కోసం పంపుతున్నారు. న్యాయశాఖ ఇచ్చే సలహామేరకు బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టాలా? లేక లోక్‌సభలో ప్రతిపాదించాలా? అన్న విషయాన్ని నిర్థారిస్తారు.

తెలంగాణ బిల్లు ఆర్థికాంశాలతో కూడిన కేటగిరి-ఎ బిల్లు అని న్యాయశాఖ నిర్థారిస్తే లోక్‌సభలో ప్రతిపాదించాల్సి ఉంటుంది. పరోక్షంగా ఆర్థికాంశాలతో కూడిన కేటగిరీ-బి బిల్లుగా న్యాయశాఖ సూచిస్తే దీన్ని రాజ్యసభలో ప్రవేశ పెట్టేందుకు వీలుంటుంది. కేంద్ర న్యాయశాఖ తన సలహాను మంగళవారం సాయంత్రంలోగా అందజేయనున్నది కాబట్టి తెలంగాణ బిల్లు బుధవారం మాత్రమే పార్లమెంట్ పరిశీలనకు వస్తుంది.

నిజానికి, బిల్లును మంగళవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అందుకోసం హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, పంచాయితీ రాజ్ మంత్రి జైరామ్ రమేష్ రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీని కలిసి తెలంగాణ బిల్లును ప్రతిపాదించటంపై చర్చలు జరిపారు. బిల్లును ముందుగా లోక్‌సభలో కాకుండా రాజ్యసభలో ప్రతిపాదించాలన్న నిర్ణయంపై సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బిజెపి కూడా సన్నద్ధమైంది.

సోమవారమే బిల్లును ప్రతిపాదించాలని అనుకున్నా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కొన్ని వివరణలు కోరటంతో తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించటం సాధ్యం కాలేదు. ప్రణబ్ ముఖర్జీ మూడు అంశాలపై వివరణ కోరుతూ తెలంగాణ బిల్లును కేంద్రానికి తిప్పిపంపారు. కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం మూడు అంశాలపై వివరణను రాష్టప్రతికి పంపింది. ప్రభుత్వం పంపిన మూడు వివరణలను రాష్టప్రతి పరిశీలించిన అనంతరం తెలంగాణ బిల్లుపై సంతకం చేసి సోమవారం మధ్యాహ్నం హోంశాఖకు పంపారు. రాజ్యసభ అప్పటికే మంగళవారానికి వాయిదాపడటంతో, తెలంగాణ బిల్లును సోమవారం ప్రతిపాదించటం సాధ్యం కాలేదు.

ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే హోంమంత్రి సుశీల్‌కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, జీవోఎం సభ్యుడు, పంచాయితీరాజ్ మంత్రి జైరామ్ రమేష్‌లు రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీని ఆయన చాంబర్‌లో కలిశారు. తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించటంపై చర్చలు జరిపారు. అయితే, తెలంగాణ బిల్లును రాజ్యసభలోనే ఎందుకు ప్రతిపాదించాలని అనుకుంటున్నారని అన్సారీ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌కు లేఖ రాశారు. ఈ స్థితిలో కేంద్ర మంత్రులు అన్సారీతో చర్చలు జరిపారు.

English summary
Rajyasabha chairman Hamid Ansari is seeking clarity on Telangana bill for taking up in Rajyasabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X