వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడి: పాకిస్తాన్ వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తున్న అన్షుల్ సక్సేనా, సోషల్ మీడియాలో వైరల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్షుల్ సక్సేనా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన పేరు వైరల్ అవుతోంది. ఎందుకంటే జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడి కారణంగా 40 మందికి పైగా జవాన్లు అమరులు కావడంతో.. అతను పాకిస్తాన్ పైన తనకు తెలిసిన విద్య ద్వారా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన పలు వెబ్ సైట్లను హ్యాక్ చేశాడు.

<strong>పుల్వామా దాడి: పలుచోట్ల కాశ్మీరీలకు వేధింపు, సీఆర్పీఎప్ హెల్ప్‌లైన్.. డోర్లు ఓపెన్ చేశామని..</strong>పుల్వామా దాడి: పలుచోట్ల కాశ్మీరీలకు వేధింపు, సీఆర్పీఎప్ హెల్ప్‌లైన్.. డోర్లు ఓపెన్ చేశామని..

వెబ్ సైట్స్ హ్యాకింగ్

అన్షుల్ సక్సేనా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (లాహోర్)తో పాటు ఐదు పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేశాడట. పాకిస్తాన్ స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్‌ను హ్యాక్ చేశాడు. ఈ మేరకు పలు వెబ్‌సైట్లు హ్యాక్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పలువురు ఇండియన్ హ్యాకర్స్ పాకిస్తాన్ వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తున్నారు. పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ వెబ్ సైట్ హ్యాక్ అయింది. పాక్ పీఎం ఫోటోను వెబ్ సైట్ నుంచి తొలగించారు.

ఆ స్క్రీన్ షాట్స్ నాకు పంపించండి

ఈ సందర్భంగా అన్షుల్ సక్సేనా ట్వీట్ చేస్తూ... సీఆర్పీఎప్ జవాన్లపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో టెర్రరిస్టులపై సోషల్ మీడియా ద్వారా సానుభూతి చూపుతున్న వారి ట్వీట్స్, ఫేస్‌బుక్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తనకు పంపించాలని, తన ఈ మెయిల్‌కు పంపించాలని సూచించాడు. వాటిని కూడా హ్యాక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

 అందరం ఒక్కచోటకు వద్దాం

అందరం ఒక్కచోటకు వద్దాం

ఇదే సమయంలో అన్షుల్ సక్సేనా ఫేస్‌బుక్‌లో.. ఇండియన్ హ్యాకర్స్ అందరు కూడా మన దేశం సైబర్ సెక్యూరిటీ కోసం పని చేయాలని, దానిపై దృష్టి పెట్టాలని, చైనా, పాకిస్తాన్ హ్యాకర్స్ నుంచి మన ఇండియన్ వెబ్ సైట్లను కాపాడాలని పేర్కొన్నారు. అలాగే వారిపై సైబర్ దాడి చేయాలని కోరారు. అందరం ఇండియన్ హ్యాకర్లము ఒక్కచోటకు వద్దమాని పేర్కొన్నారు. తాజాగా, పోస్ట్ పెడుతూ ఏ దేశద్రోహిని కూడా వదలవద్దని పేర్కొన్నారు. అన్షుల్ సక్సేనా దేశానికి, జవాన్లకు వ్యతిరేకంగా పోస్టులు చేసే వారి సోషల్ మీడియా అకౌంట్లను కూడా హ్యాక్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
Pakistan's Ministry of Foreign Affairs’ website hacked by Indian Hackers. Pak PM Imran Khan profile is removed from website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X