వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీర్ణం కోసం ఆ మాత్రలు వాడుతున్నారా.. జాగ్రత్త, కిడ్నీ దెబ్బతింటుంది..!

|
Google Oneindia TeluguNews

ముంబై: తీసుకున్న ఆహారం జీర్ణం కాక బాధపడుతున్నారా..? ఇందుకోసం అంటాసిడ్‌ టాబ్‌లెట్స్‌ను తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు . పదేపదే ఈ అంటాసిడ్ పిల్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అంటాసిడ్ టాబ్లెట్లను తయారు చేస్తున్న సంస్థలు సైడ్ ఎఫెక్ట్ వార్నింగ్ అని మాత్రల కవర్‌పై రాయాలని భారత ఔషధ నియంత్రణ మండలి సూచించింది.

సైడ్ ఎఫెక్ట్స్ వార్నింగ్ ఉండాల్సిందే

సైడ్ ఎఫెక్ట్స్ వార్నింగ్ ఉండాల్సిందే


ప్రజల ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకుని వారు తీసుకునే పిల్స్‌పై హెచ్చరికలు జారీ చేశారు ఇండియన్ డ్రగ్ కంట్రోల్ జనరల్. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఔషధ నియంత్రణ బోర్డులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ప్రజలు వాడుతున్న అంటాసిడ్స్‌ వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ టాబ్లెట్లు కలిగి ఉన్న కవర్‌పై కచ్చితంగా ''సైడ్ ఎఫెక్ట్స్'' అని రాసి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అంటాసిడ్స్‌లో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా పాన్‌టాప్, ఓమ్‌ప్రజోల్, లాన్సోప్రజోల్, ఎసోమ్‌ప్రజోల్‌తో పాటు వాటి మెడిసిన్ ఉన్న కాంబినేషన్లపై జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది డ్రగ్ డిపార్ట్‌మెంట్.

కిడ్నీ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్

కిడ్నీ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్

ఈ మెడిసిన్స్ ఉత్పత్తి అయ్యేటప్పుడే సైడ్ ఎఫెక్ట్స్ అని ముద్రించాలని పేర్కొంది. దీని ద్వారా మెడిసిన్ తీసుకునే వ్యక్తి జాగ్రత్త పడే అవకాశం ఉందని వెల్లడించింది ఔషధ శాఖ. ఈ ఔషధాలపై గత కొన్నిరోజులుగా స్టడీ చేయడం జరిగిందని డ్రగ్ కంట్రోల్ జనరల్ చెప్పారు. ఇక గ్యాస్ గుండెల్లో మంటతో బాధపడుతున్న వారు సుదీర్ఘంగా యాంటీ-యాసిడ్ మాత్రలు తీసుకుంటే కిడ్నీ ధ్వంసం అయ్యే అవకాశాలు ఉన్నట్లు స్టడీలో తేలిందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని సూచించారు. ఇది నెఫ్రాలజిస్టులకు మాత్రేమే బాగా అర్థం అవుతుందని జనరల్ ఫిజీషియన్లు ఈ విషయం గురించి చాలా తక్కువగా తెలుసని నిపుణులు చెబుతున్నారు.

 ఒకప్పుడు సేఫ్ అని భావన ఉండేది

ఒకప్పుడు సేఫ్ అని భావన ఉండేది

ప్రొటాన్ పంపింగ్ ఇన్హిబిటర్లు కలిగిన మాత్రలు టాప్ టెన్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్‌లో ఉన్నాయని దాదాపు రూ.4500 కోట్లు విలువ చేసే టాబ్లెట్లు తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి యాసిడిటీ, జీర్ణ సమస్యలకు ఎక్కువగా వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో అంటే ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, ఇంటర్నల్ మెడిసిన్ సర్జరీల్లో కూడా వినియోగిస్తారు. 20 ఏళ్ల క్రితం యాంటాసిడ్స్ వినియోగంలోకి వచ్చినప్పుడు ఇది చాలా సురక్షితం అని అంతా భావించారు. చాలా మంది గ్యాస్ట్రోఎంట్రాలిజిస్టులు కూడా ఇదే అపోహతో ఉన్నారని నిపుణుల బృందం తెలిపింది.

8వారాలకు పైగా అంటాసిడ్ మాత్రలు వాడితే అంతే..

8వారాలకు పైగా అంటాసిడ్ మాత్రలు వాడితే అంతే..

ఇదిలా ఉంటే డాక్టర్లు పేషెంట్లకు పీపీఐలు కలిగిన మాత్రలు ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక పరిమితి కాలం వరకే ఇవ్వాలని సూచించారు అమెరికాలోని భారత సంతతి నెఫ్రాలజిస్టు డాక్టర్ ప్రదీప్ అరోరా. పరిమితికి మించి అంటే 8వారాలు పైన పీపీఐలు కలిగిన టాబ్‌లెట్‌లు తీసుకుంటే కిడ్నీ పనితీరును, శరీరంలో మెగ్నీషియం లెవెల్స్‌ను మానిటర్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే జీర్ణ సమస్యలు, గుండెల్లో మంటతో బాధపడేవారికి 8 వారాల కంటే తక్కువగా యంటాసిడ్స్ తీసుకోవాలని సుదీర్ఘంగా వాడరాదని డాక్టర్ ప్రదీప్ చెప్పారు.

English summary
people who are taking antacid pills should be very careful as the usage in longterm may damage the kidney says experts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X