వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రిమూవ్ చైనా యాప్‌’కు షాక్: ప్లేస్టోర్ నుంచి తొలగింపు, ‘మిత్రోన్’ కూడా, ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా దుశ్చర్యల నేపథ్యంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న 'రిమూవ్ చైనా యాప్స్' యాప్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. థర్డ్ పార్టీ యాప్‌లను తొలగించాలని ప్రోత్సహించేలా ఈ యాప్ ఉండటం.. తమ పాలసీకి విరుద్ధమని అందుకే ఈ యాప్ తొలగించినట్లు గూగుల్ పేర్కొంది.

భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహంభారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహం

రిమూవ్ చైనా యాప్ తొలగింపు..

రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను రూపొందించిన జైపూర్‌కు చెందిన వన్ టచ్ యాప్ ల్యాబ్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. కాగా, చైనా నుంచి వచ్చిన కరోనావైరస్, దేశ సరిహద్దులో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా దళాలు ప్రయత్నించడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత వచ్చింది. చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌లో హింసను ప్రేరేపించే విధంగా ఫైజల్ సిద్దిఖీ అనే టిక్‌టాకర్ చేసిన ఓ వీడియో కూడా చైనాపై వ్యతిరేకతను మరింత పెంచింది. టిక్‌టాక్ ను బ్యాన్ చేయాలంటూ పలువురు ప్రముఖులు కూడా డిమాండ్ చేశారు.

అత్యధికరేటింగ్ కానీ.., రిమూవ్ చైనా యాప్ తొలగింపు ఇందుకే..

అత్యధికరేటింగ్ కానీ.., రిమూవ్ చైనా యాప్ తొలగింపు ఇందుకే..


ఈ క్రమంలోనే రిమూవ్ చైనా యాప్స్ అనే యాప్ మే 17న గూగుల్ ప్లే స్టోర్‌లోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే 50 లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం గమనార్హం. అంతేగాక, అత్యధికంగా 4.9 రేటింగ్ సాధించింది. మొబైల్ ఫోన్లో ఉన్న చైనా యాప్స్‌ను గుర్తించి తొలగించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఉందనే కారణంతో గూగుల్ ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే, ఏ యాప్‌ను తొలగించాలన్నది తమ ఉద్దేశం కాదని, ఎడ్యుకేట్ చేసేందుకు మాత్రమే దీన్ని రూపొందించినట్లు సంస్థ వన్ చ్ యాప్ ల్యాబ్స్ స్పష్టం చేసింది.

టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిత్రోన్ యాప్ కూడా తొలగింపు..

టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిత్రోన్ యాప్ కూడా తొలగింపు..


ఇదిఇలావుంటే, దేశ వ్యాప్తంగా చైనా వినోదపు యాప్ టిక్‌టాక్‌పై వచ్చిన వ్యతిరేకత ప్రత్యామ్నాయ యాప్ అయిన మిత్రోన్‌కు కలిసివచ్చింది. ఈ యాప్ ను ఒక నెలలోనే 5 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే, ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధంగా ఈ యాప్ ఉందంటూ దీన్ని కూడా గూగుల్ తొలగించింది. ఇతర యాప్‌లను పోలివుండటం, ఆ యాప్‌లలోని కంటెంట్‌ను అలాగే వాడటం వల్ల తొలగించినట్లు పేర్కొంది.

English summary
'Remove China Apps' which gained massive popularity in India crossing over 5 million downloads since its release in May has been pulled down by the Google Play Store on account of violating the Google Play Store’s policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X