వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృతదేహం కళ్లు పిక్కుతిన్న చీమలు. 5గురు డాక్టర్స్ సస్పెండ్

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బతికున్న రోగులకే సరైన ప్రాధాన్యం ఉండదు. వైద్యులు ఎప్పుడు ఎలాంటీ ట్రీట్‌మెంట్ ఇస్తారో అర్థం కాని పరిస్థితి. దీనికితోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఇక చనిపోయిన శవాలను ఎలా ట్రిట్ చేస్తారో అందరికి తెలిసిందే... అయితే ఇలా ఆసుపత్రిలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహంపై చీమలు పారడతంతో ఐదుగురు వైద్యులను సస్పెండ్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బాల్‌చంద్ర లోధి(50) అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స నిమిత్తం శివ్‌పురి ప్రభుత్వ ఆస్పత్రికి మంగళవారం ఉదయం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆస్పత్రిలో చేర్చుకున్న వైద్యులు చికిత్సను ప్రారంభించారు. అయితే చికిత్స పోందుతున్న నేపథ్యంలోనే బాల్‌చంద్ర మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని మార్చురికి పంపించకుండా అదే వార్డులో ఓ మూలన పడేశారు. దీంతో ఆ మృతదేహంపై చీమలు తిరుగుతూ.. కళ్లను పీకే ప్రయత్నం చేశాయి... దీంతో వాటిని రికార్డ్ చేసిన కొంతమంది నెటిజన్లు ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది.

Ants Crawl Over Dead Mans Eyes 5doctors suspend

ఇక వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ స్పందించారు. బాల్‌చంద్ర మృతిపట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఐదుగురు డాక్టర్లపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని, మానవత్వంతో మెలగాలని సీఎం డాక్టర్లకు సూచించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

English summary
The ants crawling over the eyes of a dead man at a government hospital in Madhya Pradesh, after which Chief Minister Kamal Nath has ordered an inquiry. Five doctors, have been suspended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X