హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీవ్రవాయుగుండంగా అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. తాజాగా, మరో మూడు రోజులపాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది.

తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

రానున్న 6 గంటల్లో వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది.
ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. సెప్టెంబర్ 27న ఈశాన్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, రానున్న 3 రోజులు తెలంగాణ లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.

తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం

తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం


భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం... సాయంత్రంకు వాయుగుండంగా, తదుపరి తీవ్ర వాయుగుండంగా బలపడింది. గడచిన ఆరు గంటలలో ఇది 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ప్రయాణించింది. శనివారం ఉదయం 08:30 గంటలకు వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో 18.4° ఉత్తర అక్షాంశము, 89.3° తూర్పు రేఖాంశము వద్ద కేంద్రీకృతమైంది. గోపాల్పూర్(ఒడిస్సా) కు తూర్పు-ఆగ్నేయ దిశగా 470 కిలోమిటర్ల దూరములో, కళింగ పట్టణం(ఏపీ)కు తూర్పు-ఈశాన్య దిశగా 540 కిలోమీటర్ల దూరములలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది రాగల 6 గంటలకు తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ రేపు సాయంత్రంకు ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలలో విశాఖపట్టణం & గోపాల్‌పూర్ ల మధ్య సుమారుగా కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 2.1 కిలోమీటర్ల ఎత్తుల మధ్య నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.

ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రాలో శనివారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీవర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు శని, ఆదివారాల్లో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.

దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు

దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు

దక్షిణ కోస్తా ఆంధ్రాలో శనివారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు; అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మరోవైపు రానున్న మూడు రోజుల్లో రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

English summary
AP and TS rains: next three days heavy rain in Telangana and Andhra Pradesh districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X