వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ స‌ర్కార్ ను షేక్ చేయాల‌న్న‌దే చంద్ర‌బాబు వ్యూహం.. వాడివేడిగా పార్ల‌మెంట్ స‌మావేశాలు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

దేశ రాజ‌కీయాల్లో మ‌రో సారి చ‌క్రం తిప్పేందుకు చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌లు

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు వాడి-వేడిగా జ‌ర‌గ‌బోతున్నాయా..? రెండు తెలుగు రాష్ట్రాలు పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను కుదిపేయ‌నున్నాయా.? విభ‌జ‌న హామీల అమ‌లు ప‌ట్ల విప‌క్షాలను ఏకం చేసేందుకు ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పావులు క‌దుపుతున్నారా..? మోదీ స‌ర్కార్ ను ఇరుకున పెట్టేందుకు చంద్ర‌బాబు అస్త్ర శ‌స్త్రాలు సిద్దం చేస్తున్నారా..? కేంద్రం పై అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌త్తు తెలిపేందుకు దేశం లోని బీజేపి యేత‌ర ఎంపీల ఏకాభిప్రాయానికి బాబు క్రుషి చేస్తున్నారా..? అందులో భాగంగానే ఉండ‌వ‌ల్లి, కేశ‌వ‌రావు లాంటి సీనియ‌ర్ నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. విభ‌జ‌న హామీల అమ‌లు ప‌ట్ల స్త‌బ్దుగా ఉన్న బీజేపి ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంట్ సాక్షిగా నిల‌దీసేందుకు బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు స‌మాచారం.. ఇంత‌కి చంద్ర‌బాబు కేంద్ర‌ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వేయ‌బోయే అడుగులు ఏంటి..? తెలుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

పార్ల‌మెంట్ స‌మావేశాల సాక్షిగా మోదీ స‌ర్కార్ పై చంద్ర‌బాబు స‌ర్జిక‌ల్ ఆప‌రేష‌న్..

పార్ల‌మెంట్ స‌మావేశాల సాక్షిగా మోదీ స‌ర్కార్ పై చంద్ర‌బాబు స‌ర్జిక‌ల్ ఆప‌రేష‌న్..

పార్ల‌మెంట్ స‌మావేశాల సాక్షిగా ఏపి సీయం చంద్ర‌బాబు నాయుడు మ‌రో సారి దేశ రాజ‌కాయాల్లో చ‌క్రం తిప్ప‌బోతున్నారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ కి మోదీ ఇచ్చిన హామీల‌ను ఎందుకు విస్మ‌రించార‌ని పార్ల‌మెంట్ స‌మావేశాల వేదిక‌గా మ‌రో సారి ప్ర‌శ్నించ‌బోతున్నారు. లోటు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి చేయూత అందించే విధానం ఇదేనా అని నిల‌దీయ బోతున్నారు చంద్ర‌బాబు. మిత్ర ధ‌ర్మాన్ని విభేదించి కేంద్ర ప్ర‌భుత్వం పై ప్ర‌ఛ్చ‌న్న యుద్దం చేసేందుకు బాబు పావులు క‌దుపుతున్నారు. క‌లిసి వ‌చ్చే పార్టీల మ‌ద్ద‌త్తు కూడగ‌ట్టుకుని ఏపికి జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రించాల‌ని ప‌థ‌కం వేసారు. అందుకోసం శ‌త్రుత్వం ఉన్న పార్టీల‌ను కూడా మిత్రులుగా మార్చుకునేందుకు చంద్ర‌బాబు సాహ‌సం చేస్తున్నారు.

అవిశ్వాస తీర్మానంతో కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని చంద్ర‌బాబు ప్లాన్..

అవిశ్వాస తీర్మానంతో కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని చంద్ర‌బాబు ప్లాన్..

విభ‌జ‌న హామీల అమ‌లు కోసం ఎన్నో సార్లు కేంద్రం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసినా మొండి చెయ్యి ఎదురు కావడంతో మోదీ ప్ర‌భుత్వంతో గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల్లో తెగ‌తెంపులు చేసుకున్నారు చంద్ర‌బాబు. అప్ప‌టినుండి కేంద్ర ప్ర‌భుత్వం పై ఆగ్ర‌హంగా ఉన్న చంద్ర‌బాబు పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు పావులు క‌దుపుతున్నారు. అంతే కాకుండా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టి దానికి మ‌ద్ద‌త్తు తెలిపేందుకు వివిద పార్టీ ఎంపిల‌తో మంత‌నాలు మొద‌లు పెట్టారు. ప్రాంతీయ పార్టీల‌పై కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను కూడా ఎండ‌గ‌ట్టాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేసారు. అందులో భాగంగా తెలంగాణ సీనియ‌ర్ నేత, పార్ల‌మెంట్ స‌భ్యుడు కే.కేశ‌వ‌రావుతో టీడిపి ఎంపీలు సంప్ర‌దింపులు జ‌రిపారు. భిభ‌జ‌న హామీల అమ‌లులో కేంద్ర వైఖ‌రిని నిల‌దీసేందుకు క‌లిసి రావాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌డంతో పాటు టీడిపి ప్ర‌వేశ‌పెట్ట‌బోయే అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌త్తు తెల‌పాల్సిందిగా కోరారు.

 శ‌త్రువు అయిన‌ప్ప‌టికి క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో బాబు మంత‌నాలు..

శ‌త్రువు అయిన‌ప్ప‌టికి క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో బాబు మంత‌నాలు..

దేశంలోని బీజెపియేత‌ర పార్టీల‌తో చంద్ర‌బాబు ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపారు. కేంద్ర ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం చెప్పాల్సిందిగా తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో సంప్ర‌దింపులు జ‌రిపిన చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వం పై పెట్టే అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌త్తు తెల‌పాల్సిందిగా కోరారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింద‌ని కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శించిన మోదీ ఇప్పుడు ఎందుకు న్యాయం చేయ‌డంలేదో నిల‌దీయాల‌ని బాబుకు కాంగ్రెస్ నేత‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు తెలిసింది. వివిధ సంద‌ర్బాల్లో విభ‌జ‌న గురించి, కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హ‌రించిన తీరు గురించి మోదీ ఎలా నిందించారో చంద్ర‌బాబుకు ఆధారాల‌తో స‌హా వివ‌రించారు. బుద‌వారం నుండి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ స‌మ‌వేశాల్లో విభ‌జ‌న‌లో లోపించిన హేతుబ‌ద్ద‌త గురించి మోదీ ప్ర‌సంగించిన ప్ర‌సంగాల‌ను ఆధారాల‌తో పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టేందుకు టీడిపి స‌న్నాహాలు చేస్తోంది.

 దేశ రాజ‌కీయాల్లో మ‌రో సారి చ‌క్రం తిప్పేందుకు చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌లు..

దేశ రాజ‌కీయాల్లో మ‌రో సారి చ‌క్రం తిప్పేందుకు చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌లు..

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌టి శ‌త్రువునైనా చేర‌దీసేందుకు సిద్దంగా ఉన్నామ‌నే సంకేతాల‌ను ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల‌నుకుంటున్నారు చంద్ర‌బాబు. బిభ‌జ‌న స‌మ‌యంలో హేతుబ్దంగా వ్య‌వ‌హ‌రించి రెండు తెలుగు రాష్ట్రాల‌కు స‌మ‌న్యాయం చేయాల‌ని చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసారు. స్వ‌త‌హాగా కాంగ్రెస్ పార్టీని వ్య‌తిరేకించే చంద్ర‌బాబు అప్ప‌టినుండి మ‌రింత ఆగ్ర‌హంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి త‌ర్వాత అదికారంలోకి వ‌చ్చిన బీజెపి తెలుగు రాష్ట్రాల‌కు న్యాయం చేస్తుంద‌ని ఇరు ముఖ్య‌మంత్రులు భావించారు. కాని అందుకు భిన్నంగా బీజెపి వ్య‌వ‌హ‌రించ‌డ‌దంతో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఖంగుతిన్నారు. తాజాగా విభ‌జ‌న హామీల అమ‌లులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తో క‌లిసి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామ‌నే సంకేతాల‌ను ఇస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ మ‌ద్ద‌త్తుతో బుద‌వారం నుండి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్ర ప్ర‌భుత్వానికి షాక్ ఇవ్వాల‌ని చూస్తున్నారు చంద్ర‌బాబు. చంద్ర‌బాబు వ్యూహానికి మోదీ ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌తివ్యూహం ఆలోచిస్తుందో చూడాలి.

English summary
tdp mps planning to move no confidence motion in the parliament against bjp government. ap cm chandrababu naidu bringing all parties under one roof against nda. due to not implementing the bifurcation promises chandrababu came out from bjp government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X