వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షారుక్‌కు సేన్ మద్దతు: ప్రాచీ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి లేఖ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ నటుడు 'షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్' అంటూ వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి, దర్శకురాలు, అపర్ణా సేన్ దీనిపై మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో స్పందించారు. షారుక్‌పై సాధ్వి ప్రాచీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె ట్విట్టర్‌లో తన కామెంట్స్‌ను పోస్ట్ చేశారు.

'షారుక్‌పై టీవీలో సాధ్వీ చేసిన వ్యాఖ్యల్ని నమ్మలేక పోతున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి' అని ట్వీట్ చేశారు. షారుక్ మాటలను సమర్ధించిన ఆపర్ణా సేన్, దేశంలో నెలకొన్న పరిస్ధితులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా పెరుగుతున్న దాడులకు ఇది సంకేతమన్నారు.

Aparna Sen speaks out in support of Shah Rukh Khan

పెరుగుతున్న మత అసహనానికి, దాడులకు నిరసనగా భారత రాష్ట్రపతికి ఒక లేఖను ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు. రాష్ట్రపతికి ఇచ్చే లేఖపై అందరూ సంతకం చేయాలని ఆమె కోరారు. కాగా, షారుక్ ఖాన్‌పై సాద్వీ ప్రాచీ సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్ అని ఆరోపించారు.

ఆయనకు నచ్చకుంటే దేశం విడిచి వెళ్లిపోవచ్చునని విరుచుకుపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న షారుక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. షారుక్ వ్యాఖ్యలు తీవ్రమైనవన్నారు.

షారుక్ సోమవారం తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో పెరుగుతున్న 'అత్యంత అసహనం'పై మాట్లాడారు. రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు.

షారుక్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ప్రాచీపై విధంగా వ్యాఖ్యానించారు. అలాగే, అవార్డులు వెనక్కి ఇస్తున్న వారి పైన కూడా ఆమె మండిపడ్డారు. అవార్డులు వెనక్కి ఇస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

English summary
Filmmaker Aparna Sen on Tuesday came out in support of Bollywood superstar Shah Rukh Khan after a vicious attack by VHP leader Sadhvi Prachi calling Khan a 'Pakistani agent'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X