వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపోలోకు షాక్: రూ. 375 కోట్ల ఆస్తి స్వాధీనం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రభుత్వ భూమి పంపిణి విషయంలో నియమాలు గాలికి వదిలారని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలోని బన్నేరుఘట్ట రోడ్డులో ఉన్న అపోలో ఆసుపత్రిని కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మూడు నెలల తరువాత ఈ ఆసుపత్రి ఉన్న స్థలాన్ని కిద్వాయ్ స్మారక గ్రంధి ఆసుప్రతికి అప్పగించాలని బెంగళూరు జిల్లా అధికారి (అర్బన్) వి. శంకర్ ఆదేశాలు జారీ చేశారు.

శనివారం నుండి ఎవ్వరిని ఆసుపత్రిలో చేర్పించుకొవడానికి వీలు లేదని జిల్లాధికారి శంకర్ ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలలో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న వారికి వైద్యం అందించడానికి అవకాశం కల్పించారు.

ప్రస్తుత మార్కెట్‌లో అపోలో ఆసుపత్రి ఉన్న స్థలం విలువ రూ. 375 కోట్లు, కట్టడం విలువ రూ. 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మూడు నెలలలో కట్టడం తొలగించాలని సూచిస్తూ ప్రభుత్వం అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.

Apollo Hospital on Bannerghatta Road to vacate the premises within three months.

నియమాలు ఉల్లంఘించారని....................!

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ నిసార్ అమెరికాలో మెడిసన్ ఉన్నత చదువులు చదివారు. తరువాత ఆయన కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్ర దించి తనకు 10 నుండి 15 ఎకరాల భూమి మంజూరు చేస్తే ఇంపిరియల్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన కేంద్రం ఎర్పాటు చేస్తానని అర్జి సమర్పించారు. కర్ణాటక ప్రభుత్వం డాక్టర్ సయ్యద్ నిసార్ సమర్పించిన అర్జి పరిశీలించింది. క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరుగుతుందని భావించారు.

బెంగళూరు దక్షిణ తాలుకా బన్నేరుఘట్ట రోడ్డులోని బిళేకళి దగ్గర ఉన్న సర్వే నెంబర్.154/11లోని 5 ఎకరాల భూమిని డాక్టర్ సయ్యద్ నిసార్ కు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. 1991లో సయ్యద్ నిసార్ కు భూమిమంజూరు చేస్తూ ప్రభుత్వం షరతులతో కూడిన ఆదేశాలు జారి చేసింది. నిసార్ కు ప్రతి ఎకర భూమి కేవలం రూ. 2 లక్షలకు ఇచ్చారు.

ఈ ఐదు ఎకరాల భూమిని ఇంపిరియల్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన కేంద్రానికి ఉపయోగించాలని, ఎవ్వరికి విక్రయించరాదని, లీజుకు, అద్దెకు ఇవ్వరాదని, కుదువ పెట్టరాదని ప్రభుత్వం షరతులు విదించింది. అయితే డాక్టర్ సయ్యద్ నిసార్ నియమాలు ఉల్లంఘించి ఈ భూమిని అపోలో ఆసుపత్రికి అద్దెకు ఇచ్చారు.

ఐఏఎస్ అధికారి వి. బాలసుబ్రమణ్యన్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటి డాక్టర్ సయ్యద్ సలీం నియమాలు ఉల్లంఘించి భూమిని అపోలో ఆసుపత్రికి అప్పగించారని గుర్తించారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. అపోలో ఆసుపత్రిలోని ఒక గదికి మాత్రం పేరుకు ఇంపిరియల్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోనధన కేంద్రం అని బోర్డు పెట్టారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

English summary
The Bengaluru Urban district administration issued notice to Apollo Hospital on Bannerghatta Road to vacate the premises within three months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X