వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 చోట్ల పనిచేయలేదు, జాబ్‌కు మాత్రం ఆప్లై చేశా, కొత్త మలుపు తిరిగిన యూపీ రూ.కోటి స్కాం కథ..

|
Google Oneindia TeluguNews

ఒక మహిళ.. 25 కొలువులు, 13 నెలల నుంచి రూ.కోటి ప్రభుత్వ నగదు విత్ డ్రా... కానీ తెరపైకి అనామిక శుక్లా వచ్చారు. ఇప్పటివరకు ఆమెను 25 ఉద్యోగాలు చేసి.. నగదు తీసుకున్నారని అనుకోవడంతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. తాను ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ ఒక్క ఉద్యోగంలో కూడా చేరలేదని తెలుపడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందుకు గల కారణాలను కూడా ఆమె వెల్లడించింది. ఇంతకీ యూపీ కస్తూర్బా స్కూల్ టీచర్ స్కాంలో హస్తం ఎవరిదీ..? ఆ నగదు ఎవరు విత్ డ్రా చేశారు.

Recommended Video

యూపీ స్కూల్ టీచర్ రూ.కోటి స్కాం కొత్త మలుపు...!!
గర్భవతిని కావడంతో

గర్భవతిని కావడంతో

యూపీలోని పలు జిల్లాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశానని అనామికా శుక్లా పేర్కొన్నారు. కానీ తాను ఉద్యోగంలో చేరలేదని.. ఆ సమయంలో తాను గర్భవతినని తెలిపారు. అయితే తాను 2017 నుంచి వివిధ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేశానని తెలిపారు. అయితే సదరు పాఠశాలల నుంచి తన సర్టిఫికెట్లు ఎవరైనా తీసుకుని ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే సర్టిఫికెట్లను ఎవరైనా తస్కరించి ఉంటారా అని సస్పెక్ట్ చేశారు. తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ టీచర్‌గా పనిచేయాలని కాల్స్ వచ్చాయని.. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో వీలు కాలేదన్నారు.

ఎవరో మిస్ యూజ్ చేశారు

ఎవరో మిస్ యూజ్ చేశారు

అయితే తన సర్టిఫికెట్లు ఎవరూ మిస్ యూజ్ చేశారో అర్థం కావడం లేదన్నారు. మోసానికి సంబంధించి వార్తలో చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. తర్వాత బేసిక్ శిక్ష అధికారి వద్దకు వెళ్లి.. తన వద్ద గల సర్టిఫికెట్లను చూపించానని తెలిపారు. ఇందులో తన తప్పు లేదు అని.. మోసం చేసినవారిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆమె భర్త దుర్గేశ్ శుక్లా కూడా ఎవరో కావాలని చేశారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తమ పరువుపోయిందని.. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇలా బయటపడింది

ఇలా బయటపడింది

యూపీ విద్యాశాఖ అధికారులు డాటా బేస్‌లో వివరాలు వెలికితీస్తుండగా కుంభకోణం బయటపడింది. మెయిన్ పురికి చెందిన అనామిక శుక్లా.. 25 స్కూళ్లలో పనిచేస్తున్నారని గుర్తించారు. 13 నెలలుగా రూ. కోటి నగదు విత్ డ్రా చేసినట్టు గుర్తించారు. దీంతో ఆమెకు వేసవిలో జీతం వేయలేదు. అమేథీ, అంబేద్కర్ నగర్, రాయ్ బరేలి, ప్రయాగ్ రాజ్, అలీఘర్ సహా 25 చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డులో ఉంది. దీంతో మోసం బయటపడింది. దీనిపై విద్యాశాఖ విచారణకు కూడా ఆదేశించింది. ఈ క్రమంలో అనామికా శుక్లా.. తాను పనిచేయడం లేదు అని.. తన సర్టిఫికెట్లను ఎవరో మిస్ యూజ్ చేశారని అనడంతో స్కాం కొత్త మలుపు తీసుకుంది.

English summary
Anamika Shukla, has said she had only applied for these jobs and did not take them up as she became pregnant at the time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X