వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశవ్యాప్తంగా రోజంతా కరెంట్..! ఏప్రిల్ ఫూల్ కాదు నిజమే

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : దేశమంతటా 24 గంటల కరెంటును సరఫరా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. నిరంతరాయంగా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం గత కొద్దినెలలుగా కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. మొత్తానికి అనుకూల పరిస్థితులు కనిపించడంతో.. అనుకున్న సమయానికి అంటే ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 24 గంటల కరెంటు ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఢిల్లీ : దేశమంతటా 24 గంటల కరెంటును సరఫరా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. నిరంతరాయంగా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం గత కొద్దినెలలుగా కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. మొత్తానికి అనుకూల పరిస్థితులు కనిపించడంతో.. అనుకున్న సమయానికి అంటే ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 24 గంటల కరెంటు ఇచ్చేందుకు సిద్ధమైంది.

 రోజంతా కరెంటే..!

రోజంతా కరెంటే..!

దేశమంతటా అన్ని గ్రిడ్ లను అనుసంధానించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అది కాస్తా పూర్తి కావడంతో రోజంతా కరెంటు ఇవ్వడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు కేంద్ర అధికారులు చెబుతున్న మాట. గ్రిడ్ ల అనుసంధానం కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటును దేశమంతటా ఎక్కడైనా వినియోగించుకునే వెసులుబాటు కలగనుంది. దీంతో
జమ్మూ కశ్మీర్ లోని జలవిద్యుత్ కేంద్రం ద్వారా తయారవుతున్న విద్యుత్ ను కన్యాకుమారికి, గుజరాత్ లోని సోలార్ పవర్ నుఅరుణాచల్ ప్రదేశ్ కు సరఫరా చేయడానికి వీలవుతుంది.

లెక్క తప్పితే డిస్కంలకు ఫైన్

లెక్క తప్పితే డిస్కంలకు ఫైన్

గ్రిడ్ ల అనుసంధానంతో దేశమంతటా 24 గంటల కరెంటును అందించాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ క్రమంలో విఫలమయ్యే డిస్కంలపై జరిమానా సైతం విధించాలని యోచిస్తోంది. అందులోభాగంగా మంగళవారం (26.02.2019) నాడు గురుగ్రామ్ లో ఆయా రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో సెంట్రల్ పవర్ మినిస్టర్ ఆర్.కె.సింగ్ భేటీ అవుతున్నారు.

ఏప్రిల్ 1 నుంచే..!

ఏప్రిల్ 1 నుంచే..!

24 గంటల విద్యుత్ అంశం సాధ్యాసాధ్యాలపై కేంద్ర మంత్రి విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తప్ప మిగతా సమయంలో 24 గంటల కరెంటు అమలు చేయాలనే ధృడ సంకల్పంతో ఉంది కేంద్రం. అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 1 నుంచి దేశమంతటా రోజంతా కరెంటు ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది.

తెలంగాణలో ఇప్పటికే 24 గంటల కరెంటు అమలు విజయవంతంగా అమలవుతోంది. ఛత్తీస్ గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేస్తున్న తెలంగాణ సర్కార్.. కరెంటు కోతలు లేకుండా చూస్తోంది. త్వరలో కేంద్రం అమలు చేసే 24 గంటల కరెంటుతో తెలంగాణకు కొంతమేర ఖర్చులు తగ్గినట్లవుతుంది. 24 గంటల కరెంటు భారం కేంద్రంపై పడనుండటంతో తెలంగాణ ప్రభుత్వానికి కాసింత కలిసొచ్చే అవకాశముంది.

English summary
Central government plans to implement 24 hours non stop current all over country. If all set well, It may be start from april first.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X