• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రండి దీపాలు వెలిగించండి: వాజపేయి ప్రసిద్ధ పద్యాన్ని ట్వీట్ చేసిన మోడీ

|

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఐక్యతను చాటేందుకు తమ ఇళ్ళలోని లైట్లు ఆపివేసి.. దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫోన్లు, టార్చ్‌లు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఇందుకు సిద్ధమవుతోంది.

తాజాగా, నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో దీపాలు వెలిగించే విషయమై ఓ వీడియో పోస్టు చేశారు. 'రండి దీపాలు వెలిగించండి' అంటూ మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజపేయి చెప్పిన పద్యాన్ని దానికి జోడించారు నరేంద్ర మోడీ.

 April 5th 9mins-9PM Appeal: PM Modi Shares Atal Bihari Vajpayees Iconic Poem

మళ్ళీ దీపం వెలిగించుకుందాం.

ఇది మధ్యాహ్నం చీకటి

సూర్యుడు నీడలతో ఓడిపోయాడు

చమురు వలె, మనలోని చీకటిని బయటకు తీద్దాం

మరియు ఆరిపోయిన మంటను తిరిగి మండించండి

మళ్ళీ దీపం వెలిగించుకుందాం.

మేము గమ్యం కోసం మైలురాయిని గందరగోళపరిచాము

మా లక్ష్యం మన దృష్టి నుండి పారిపోయింది

వర్తమాన భౌతిక ఉచ్చులలో

ఇంకా రేపు రాబోయేది మర్చిపోవద్దు.

మళ్ళీ దీపం వెలిగించుకుందాం.

త్యాగం పెండింగ్‌లో ఉంది, యజ్ఞం అసంపూర్ణంగా ఉంది

మన సొంత బంధువుల నుండి పుట్టిన అడ్డంకుల చుట్టూ

తుది విజయం యొక్క వజ్రాయుధంను పునర్నిర్మించడానికి

నేటి దధీచి వారి ఎముకలను మళ్ళీ కరిగించాలి.

మళ్ళీ దీపం వెలిగించుకుందాం.

ఇది ఇలావుండగా, ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ అన్ని విధాలా సిద్ధమైంది. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాహ్లీ లేఖ రాశారు. అందరూ ఒకేసారి లైట్లు ఆపివేయడం వల్ల గ్రిప్‌పై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రధాని మోడీ తన పిలుపులో కేవలం లైట్లు మాత్రమే ఆపివేయాలని పిలుపునిచ్చారని.. అందువల్ల ఇంట్లోని ఫ్రిజ్, ఏసీ, టీవీ, కూలర్లు, తదితర వస్తువులను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు. వీధి లైట్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. వీధి లైట్లు, శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అంతేగాక, ఆస్పత్రులు సహా అన్ని అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒకేసారి లైట్లన్నీ ఆపేయడం వల్ల పవర్ గ్రిడ్‌లు కుప్పకూలిపోతాయంటూ వస్తున్న పుకార్లపైనా కేంద్ర విద్యుత్ శాఖ స్పందించింది. పవర్ గ్రిడ్‌లకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 5న కార్యక్రమానికి అన్ని విధాలా విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు లైట్లు ఆపివేసి.. దీపాలు వెలిగించే సమయంలో ప్రజలెవరూ కూడా చేతులకు శానిటైజర్ పూసుకోవద్దని ప్రభుత్వంతోపాటు నిపుణులు చెబుతున్నారు. శానిటైజర్‌లో ఆల్కహాల్ ఉన్నందున దానికి మండే గుణం ఉంటుందని, అందువల్ల దీపాలు వెలిగించే సమయంలో చేతులకు శానిటైజర్లను రాసుకుంటే మంటలు వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయం పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.

English summary
A day after Prime Minister Narendra Modi appealed to light a candle for 9 minutes on 9 PM, Sunday, as a symbol that India is fighting Coronavirus unitedly, he has shared a video of late former PM Atal Bihari Vajpayee reciting his iconic poem - "Aao fir se diya jalaye" (Let us light the candle again).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more