వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్సిజన్‌ కొరతపై గత ఏడాదే హెచ్చరికలు- అయినా కేంద్రం పట్టించుకోలేదా ?

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులతో ఆక్సిజన్ కొరత తీవ్ర సమస్యగా మారిపోయింది. మహారాష్ట్ర, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నాయి. అయినా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోలేకపోతోంది. గతేడాది కరోనా సమయంలోనే ఆక్సిజన్ కొరతపై పలు విజ్ఞప్తులు, సూచనలు, హెచ్చరికలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఈ పరిస్ధితి ఎదురైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల కమిటీతో పాటు పార్లమెంటరీ స్ధాయీ సంఘం ఆక్సిజన్ కొరతపై ఏడాది క్రితమే హెచ్చరించినా కేంద్రం నిర్లక్ష్యం వహించడం ప్రస్తుతం పరిస్ధితికి దారి తీస్తోంది.

 దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్ల కంటే ఆక్సిజన్ కొరతే సమస్యగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అత్యవసర కేసులు పెరిగిపోతుండటమే. దీంతో రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచాల్సిన కేంద్రం చోద్యం చూస్తోంది. పరిస్ధితి విషమించాక ఇవాళ ఆక్సిజన్ సరఫరా దారులతో ప్రధాని మోడీ వర్చువల్ మీట్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఆక్సిజన్ కొరత విషయంలో కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

 గతేడాదే అధికారుల కమిటీ హెచ్చరిక

గతేడాదే అధికారుల కమిటీ హెచ్చరిక

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం వల్లే ఆక్సిజన్‌ కొరత సమస్యగా కనపిస్తోందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి. ఎందుకంటే గతేడాది కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే దేశంలో ఆక్సిజన్ కొరతపై అధికారులు, పార్లమెంటరీ స్ధాయీ సంఘం కూడా కేంద్రానికి పలు హెచ్చరికలు చేశాయి. అయినా కేంద్రం పట్టించుకోలేదని తాజా పరిస్దితి చూస్తుంటే తెలుస్తోంది. గతేడాది లాక్‌డౌన్ విధించిన వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్‌ 1న కేంద్రం నియమించిన 11 ఉన్నతస్దాయి అధికారుల కమిటీల్లో ఒక కమిటి ఆక్సిజన్‌ కొరత తీవ్ర సమస్యగా మారనుందని హెచ్చరించింది. అయితే కేంద్రం ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టింది.

పార్లమెంటరీ స్ధాయీ సంఘం చెప్పినా

పార్లమెంటరీ స్ధాయీ సంఘం చెప్పినా


మరోసారి గతేడాది నవంబర్‌లో పార్లమెంటరీ స్ధాయీ సంఘం కూడా ఆక్సిజన్ కొరతపై కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్న ఆక్సిజన్ నిల్వల డిమాండ్‌, అందుబాటులో ఉన్న నిల్వలను గమనిస్తే కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్ధాయీ సంఘం తమ నివేదికలో పేర్కొంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ కరోనా చికిత్సలో వాడుతున్న నాన్‌ ఇన్వేజివ్ ఆక్సిజన్‌తో మంచి ఫలితాలు ఉంటున్నాయని కూడా తెలిపారు. వీటికి నిర్ణీత ధరలు కూడా నిర్ణయించాలని జాతీయ ఫార్మాసుటికల్ ప్రైసింగ్‌ అధారిటీని కూడా కోరారు. ఈ విషయాన్ని కేంద్రమే రాజ్యసభలో గత నవంబర్‌లో వెల్లడించింది.

English summary
Almost drowned by the alarm bells ringing across the nation over the critical shortage of oxygen in the second Covid wave is the fact that the warning signs came clear and early: in April one full year ago and then again in November.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X