తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీఎస్ఆర్ టీసీ బెంగళూరు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గా ఎస్.వీ. ప్రభాకర్ !

ఏపీఎస్ఆర్ టీసీ బెంగళూరు కార్యాలయంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజ్ గా ఎస్.వీ. ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. బెంగళూరు నుంచి ఆంధ్రపద్రేశ్ లోని వివిధ ప్రాంతాలకు సంచరిస్తున్న ఏపీఎస్ఆర్ టీసీ బస్సు సర్వీసులను

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఏపీఎస్ఆర్ టీసీ బెంగళూరు కార్యాలయంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజ్ గా ఎస్.వీ. ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. బెంగళూరు నుంచి ఆంధ్రపద్రేశ్ లోని వివిధ ప్రాంతాలకు సంచరిస్తున్న ఏపీఎస్ఆర్ టీసీ బస్సు సర్వీసులను ప్రభాకర్ పర్యవేక్షించనున్నారు.

ఇటీవల వరకు మదనపల్లి 2 డిపో మేనజర్ గా సేవలు అందించిన ఎస్ వీ. ప్రభాకర్ బెంగళూరు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గా బదిలి అయ్యారు. ఇటీవల వరకు ఏపీఎస్ ఆర్ టీసీ బెంగళూరు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనజర్ గా రవీంద్రనాథ్ రెడ్డి చిత్తూరు 2 డిపోకు బదిలి అయ్యారు.

Karnataka: APSRTC Madanapalle 2 depo manager SV Prabhakar transfer to Bangalore.

గతంలో బెంగళూరులో ఏపీఎస్ఆర్ టీసీ అధికారిగా ఎస్.వీ. ప్రభాకర్ 10 ఏళ్లకు పైగా విధులు నిర్వహించారు. మెజస్టిక్ లో ఏపీఎస్ఆర్ టీసీ కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చెయ్యడంలో ప్రభాకర్ కీకలపాత్ర పోషించారు. కన్నడ బాష మీద ఆయనకు మంచి పట్టు ఉంది.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్, తిరుపతి, చిత్తూరు, కాళహస్తి, నెల్లూరు, కావలి, గుంటూరు, విజవాడ, మదనపల్లి, కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, కదిరి, గోరంట్ల, ప్రోద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి బెంగళూరు వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా ఇంటర్ స్టేట్ పర్మిట్లు తీసుకోవడంలో ప్రభాకర్ కీలకపాత్ర పోషించారు.

APSRTC Madanapalle 2 depo manager SV Prabhakar transfer to Bangalore.

ఇక్కడి కేఎస్ఆర్ టీసీ అధికారులతో చర్చించి బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా ఏపీఎస్ఆర్ టీసీ ఇంటర్ స్టేట్ పర్మిట్లు సంపాధించడంలో ప్రభాకర్ శక్తి వంచన లేకుండా కృష్టి చేశారు.

కేఎస్ఆర్ టీసీ అధికారులతో నిత్యం ఆయన టచ్ లో ఉండేవారు. ఆంధ్రపద్రేశ్ నుంచి బెంగళూరుకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రయాణిలకు ఏమైనా సమస్యలు వస్తే వెంటనే విషయం తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేవారు. వృద్దులు, చిన్నారులకు బస్సుల్లో సీట్లు ఇప్పించడానికి ప్రభాకర్ అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.

ప్రతి పండుగకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకు ప్రవాసాంధ్రులు వెళ్లడానికి వీలుగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించడానికి ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి కర్ణాటక పర్మిట్లు తీసుకునేవారు. పండుగలకు సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రవాసాంధ్రులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా ఇంటికి చేరడానికి చర్యలు తీసుకునేవారు.

ఏపీఎస్ఆర్ టీసీ బెంగళూరు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గా పని చేస్తున్న ప్రభాకర్ ను తరువాత మదనపల్లి 2 డిపోకు బదిలి చేశారు. ప్రభాకర్ సేవలను గుర్తించి ఏపీఎస్ఆర్ టీ యాజమాన్యం మళ్లీ ఆయన్ను బెంగళూరుకు బదిలి చేసింది. బెంగళూరు కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన ప్రభాకరన్ ను ఇక్కడి ఏపీఎస్ఆర్ టీసీ పీఆర్ఓ జగదీష్, సిబ్బంది తదితరులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతించారు.

English summary
Karnataka: APSRTC Madanapalle 2 depo manager SV Prabhakar transfer to Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X