వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ట్విస్ట్: షీనా బోరా ఫోరెన్సిక్ శాంపిళ్లు మిస్..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా మర్డర్ కేసు దర్యాప్తులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి, ఎంతో ముఖ్యమైన షీనా బోరా ఫోరెన్సిక్ శాంపిల్స్ మిస్ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

షీనా బోరాను ఆమె కన్న తల్లి ఇంద్రాణి ముఖార్జియా 2012, ఏప్రిల్ 24వ తేదీన షీనా బోరా హత్య చేసిన సంగతి తెలిసిందే. షీనా బోరాను హత్య చేసిన అనంతరం, ఆమెను తగలబెట్టిన ప్రాంతాన్ని ముంబై పోలీసులు తవ్వి ఆమెకు చెందిన కొన్ని ఎముకలు, పుర్రెతో పాటు ఒక సూట్ కేసును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

స్వాధీనం చేసుకున్న ఎముకలు, పుర్రెలను ముంబై పోలీసులు జేజే ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ శాంపిళ్లు కనిపించకుండా పోయాయనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.

Are Sheena Bora's forensic samples missing again?

ఈ విషయంపై అటు ముంబై పోలీసులు, జేజే ఆసుపత్రి లేదంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఎవరూ కూడా నోరు మెదపడం లేదు. మిడ్ డే పత్రిక కథనం ప్రకారం షీనా బోరా ఎముకలను భద్రపరిచినట్లు పెన్ పోలీస్ స్టేషన్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడవి అక్కడ కనిపించడం లేదంట. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మరోసారి సమర్పించాల్సిన శాంపిళ్లపై గందరగోళం నెలకొంది.

ఇది ఇలా ఉంటే షీనా బోరా అస్థిపంజరంలోని కొన్ని ఎముకలను తీసుకుని డీఎన్ఎ పరీక్ష చేయగా అవి షీనా తల్లి ఇంద్రాణి ముఖార్జియా, సోదరుడు మైఖెల్ డీఎన్ఎతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.

English summary
Forensic samples in the Sheena Bora murder case seem to have gone missing yet again. Just last month, Mumbai Police had launched a frenzied search for the evidence that had been collected by the Pen police after they came upon the burnt, decomposing body in May 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X