వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ బిల్లులు పాస్ చేస్తున్నామా..? పిజ్జాలు డెలివరి చేస్తున్నామా..? టీఎంసీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

రెండవసారి తిరుగులేని అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అంత్యంత ఉత్సహాన్ని కనబరుస్తుంది. ఈనేపథ్యంలోనే పెండింగ్‌లో ఉన్న బిల్లులను అటు లోక్‌సభ,ఇటు రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పోందుతుంది. అయితే ఇలా బిల్లులను ప్రవేశపెట్టి గతంలో ఎప్పుడు లేనట్టుగా బిల్లులు ఆమోదింపచేసుకోవడంపై త‌ృణముల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పలు విమర్శలు చేశాడు. పార్లమెంట్‌లో బిల్లులు పాస్ చేస్తున్నామా లేదంటే ఎమైనా పిజ్జాలు డెలివరీ చేస్తున్నామా అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

ఈనేపథ్యంలోనే గత ప్రభుత్వాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పోందడంతోపాటు నిరాకరించిన బిల్లుల వివరాలను కూడ ఆయన ట్విట్టర్‌లో పోందుపరిచాడు. దీంతో 14వ లోక్‌సభలో 60 శాతం, 15వ లోక్‌సభలో కాలంలో 71శాతం బిల్లులు తిరస్కరిస్తే, 16వ లోక్‌సభలో (2014-2019)కాలంలో మాత్రం కేవలం 26శాతం బిల్లులు మాత్రమే వెనక్కివెళ్లాయి. ప్రస్తుత 17వ లోక్‌సభలో దాన్ని మరింత తక్కువగా 5శాతానికి దిగజార్చారంటూ ఆయన ఆరోపించారు.

Are we delivering pizzas or passing legislation? :MP Derek O’Brien

కాగా లోక్‌సభలో ఉన్న మెజారీటీతో బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లుతోపాటు, ఆర్టీఐ,లాంటీ బిల్లులను కేంద్రం ఆమోదింపచేసుకుంది. దీంతో పార్లమెంట్‌లో ప్రభుత్వం వ్వవహరిస్తున్న తీరు చూస్తే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆయన విమర్శించారు.గత పార్లమెంట్ వ్యవహారాలకు ,ప్రస్థుతం కొనసాగుతున్న వ్యవహారాలకి చాల తేడా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Are we delivering pizzas or passing legislation? MP Derek O’Brien questioned,MP Derek O’Brien attacked the government over the hurried passage of bills,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X