• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుష్టుగా అన్నం తింటున్నారా..! త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

|

హైద‌రాబాద్ : అన్నం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపిణి. భార‌త ప్ర‌జ‌లు బియ్యాన్ని, భుజించే భోజనాన్ని అంత‌టి ప‌ర‌మ ప‌విత్రంగా భ‌విస్తుంటారు. చాలా ఇళ్ల‌ల్లో అన్నం తినే ముందు తొలి ముద్ద‌ను క‌ళ్ల‌కు అద్దుకుని తిన‌డం ఆచారంగా వ‌ప్తోంది. ఇప్ప‌టికి ఆ సంస్క్రుతి కొన‌సాగుతోంది కూడా. ఇక ఎక్క‌డికైనా భోజ‌నానికి వెళ్లి భోజ‌నం చేసిన త‌ర్వాత అన్న దాతా సుఖీభ‌వ అంటుంటాం..! అంటే అన్నం పెట్టిన అతిది అన్నా తినే అన్నం అన్నా అంత విశిష్టంగా భావిస్తుంటారు భార‌త ప్ర‌జ‌లు. అంత ప‌విత్రంగా భావించే అన్నం, మాన‌వ ప్రాణాల‌కు మ‌ణిదీపంగా ఉండే అన్నం ప్ర‌మాధ ఘంటిక‌లు మోగిస్తోంది.

ప్ర‌మాదంగా మారుతున్న తిండి గింజ‌లు..! క‌డుపునిండా తింటే ఖ‌త‌మే..!!

ప్ర‌మాదంగా మారుతున్న తిండి గింజ‌లు..! క‌డుపునిండా తింటే ఖ‌త‌మే..!!

కోటి విద్య‌లు కూటి కొర‌కే అన్న నానుడు అర్థం మారుతోంది. కోటి విద్య‌లు శ‌రీరంలోని కొవ్వును త‌గ్గంచుకోవ‌డానికి అన్న‌ట్ఠు త‌యార‌య్యాయి ప‌రిస్థితులు. భార‌తీయ ప్ర‌జ‌లు ముఖ్యంగా ద‌క్షిణ భార‌త దేశ నివాసులు భోజ‌నంలో ఎక్కువ‌గా అన్నం తింటుంట‌డం ఆన‌వాయితీ. ఇక ఉత్త‌ర భార‌త‌దేశంలో మాత్రం ఆహార‌పు అల‌వాట్లు ఇందుకు కాస్త భిన్నంగా ఉంటాయి. అక్క‌డ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గోదుమ,జొన్న‌ల ఆహార ప‌దార్థాల‌కు ప్రాముఖ్య‌త‌నిస్తారు. అంటే ఒంట్లో కొవ్వు చేర‌కుండా కాస్త జాగ్ర‌త్త ప‌డుతుంటారు. ఇప్పుడు ఇదే సంస్క్రుతి ద‌క్షిణానికి కూడా పాక‌డం విశేషం.

పాలీష్ బియ్యం చాలా ప్ర‌మాదం సుమీ..! మానెయ్య‌డం బెట‌ర్..!!

పాలీష్ బియ్యం చాలా ప్ర‌మాదం సుమీ..! మానెయ్య‌డం బెట‌ర్..!!

అన్నం.. దాదాపు 200 కోట్ల మందికి ప్రధాన ఆహారం. 100 కోట్ల మందికి జీవనాధారం. భారత్‌, చైనా లాంటి దేశాల్లో శతాబ్దాలుగా ఆకలి తీర్చే అమృతం. ఇప్పుడు అదే విషంగా మారుతోందా? రక్తంలో చేరి రక్కసిలా పీడిస్తోందా? చాపకింద నీరులా మనిషిని కుంగదీస్తోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. కూల్‌డ్రింక్‌ల కన్నా అన్నమే ఎక్కువ ప్రమాదం అని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మధుమేహ వ్యాధి రావడానికి ఇది ప్రధాన కారణమవుతోందని చెబుతున్నాయి. బియ్యం తెల్లగా మెరవడానికి మిల్లుల్లో పాలిష్‌ చేయడం వల్ల ఉన్న పోషకాలన్నీ తౌడుగా మారిపోతున్నాయి.

 కూల్‌డ్రింక్‌ల కన్నా అన్నమే ప్రమాదం..! త‌గ్గిస్తే చాలా మంచిది..!

కూల్‌డ్రింక్‌ల కన్నా అన్నమే ప్రమాదం..! త‌గ్గిస్తే చాలా మంచిది..!

పాలిష్‌ పెట్టిన బియ్యాన్ని మనం తినడం వల్ల పోషకాలు శరీరానికి అందక కేవలం గ్లూకోజ్‌ రూపంలో చక్కెర మాత్రమే రక్తంలో కలుస్తోంది. ఇది అంతకంతకూ పెరిగి చివరికి మధుమేహానికి దారితీస్తోందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధకులు చైనా, జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలోని 3.5 లక్షల మందిని 20 ఏళ్ల పాటు పరీక్షించగా రోజూ ఒక కప్పు అన్నం తిన్న వారిలో వ్యాధి వచ్చే రేటు 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు.

దొడ్డు బియ్యమే మేలు..! నాలుగు రోజులు ఆరోగ్యంగా ఉండొచ్చు..!!

దొడ్డు బియ్యమే మేలు..! నాలుగు రోజులు ఆరోగ్యంగా ఉండొచ్చు..!!

బ్రౌన్‌ రైస్‌ తినడం వల్ల కొన్ని పోషకాలు ఒంటికి అంది ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక, సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యమే మేలు. ఒక కప్పు అన్నంలో , 53.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 242 కెలోరీలు, 4.4 గ్రాముల ప్రొటీన్లు,

0.6 గ్రాముల ఫైబర్‌, 0.4 గ్రాముల కొవ్వు ఉంటాయి. ఇన్ని ప్ర‌మాద‌క‌ర కొవ్వు ప‌దార్థాలు తినే అన్నంలో ఉంటాయి కాబ‌ట్టే ఓ సాదార‌ణ కూల్ డ్రింక్ క‌న్నా ప్ర‌మాద‌మ‌ని డాక్ట‌ర్లు నిర్థారిస్తున్నారు. సో భోజ‌న ప్రియులు ఇక‌నైనా సుష్టుగా అన్నం తిన‌డం మానేస్తే నాలుగు రోజులు కాస్త ఆరోగ్యంగా బ‌త‌కొచ్చు. ఆలోచించండి మ‌రి.

English summary
Nutrients that we eat from polished rice are just glucose-only sugar in the blood. This has led to diabetes and ultimately leading to diabetes, according to scientists from the Harvard School of Public Health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X