వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ఎంఎస్‌తో ఆధార్ లింక్: ఆ ప్రకటనలతో జాగ్రత్త, మాకేం తెలియదు: ఎల్ఐసీ

ఆధార్‌ను ఎల్ఐసీకి లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్‌తో పాలసీ నెంబర్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే ఎల్ఐసితో ఆధార్‌ను లింక్ చేసుకోవాలంటూ వచ్చే ఎస్ఎంఎస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్‌ను ఎల్ఐసీకి లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్‌తో పాలసీ నెంబర్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే ఎల్ఐసితో ఆధార్‌ను లింక్ చేసుకోవాలంటూ వచ్చే ఎస్ఎంఎస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎల్ఐసీ హెచ్చరించింది.

ఎల్ఐసీ పాలసీలను కూడ ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఐఆర్‌డిఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎల్ఐసి పాలసీదారులు
ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే ఎల్ఐసీ పాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలనే విషయమై కొందరు తమ జేబులు నింపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్ఐసీ పాలసీదారులకు తెలియకుండానే వారి సొమ్మును కాజేసేందుకు మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్ఐసీ హెచ్చరించింది.

ఆ ఎస్ఎంఎస్‌లు నమ్మొద్దు

ఆ ఎస్ఎంఎస్‌లు నమ్మొద్దు

ఎల్‌ఐసీ పాలసీదారులా? మీ పాలసీని ఆధార్‌తో ఎస్సెమ్మెస్‌ ద్వారా అనుసంధానం చేసుకోవాలని మీ మొబైల్‌కు సందేశమేదైనా వచ్చిందా? ఇటీవల ఎస్సెమ్మెస్‌ ద్వారా ద్వారా పాలసీని ఆధార్‌తో జత చేసుకోవాలంటూ వస్తున్న సందేశాలపై ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ స్పందించింది. అలాంటి సందేశాలు నమ్మొద్దు అంటూ ఒక ప్రకటన జారీ చేసింది.ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేసుకొనే ప్రక్రియను ప్రారంభించలేదన్నారు.

సోషల్ మీడియాలో ప్రచారం

సోషల్ మీడియాలో ప్రచారం

ఎల్ఐసి పాలసీని ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతున్న విషయాన్ని ఎల్ఐసీ గుర్తించింది. ఎల్‌ఐసీ లోగోతో కూడిన ఓ సందేశం విస్తృతంగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమ పాలసీకి ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలనుకునే వారు అందులో ఉన్న నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ పంపాలన్నది దాని సారాంశం. ఈ తరహ ప్రచారాన్ని చూసి మోసపోకూడదని ఎల్ఐసీ ప్రకటించింది.

ఆ ప్రచారంతో ఎల్ఐసీకి సంబంధం లేదు

ఆ ప్రచారంతో ఎల్ఐసీకి సంబంధం లేదు

ఎస్ఎంఎస్ ద్వారా ఎల్ఐసీ పాలసీని ఆధార్‌తో లింక్ చేస్తామని ఎస్ఎంఎస్ వస్తే జాగ్రత్త పడాలని కస్టమర్లను హెచ్చరించింది ఎస్ఎంఎస్. తమ ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో తాము ఈ ప్రకటనను జారీ చేస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది.

వెబ్‌సైట్‌లో ఎస్ఎంఎస్ ద్వారా ప్రకటిస్తాం

వెబ్‌సైట్‌లో ఎస్ఎంఎస్ ద్వారా ప్రకటిస్తాం

ఎస్సెమ్మెస్‌ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేసుకునే సదుపాయమేదీ ప్రస్తుతానికి కల్పించలేదని ప్రకటించింది ఎల్ఐసీ. ఒక వేళ ఆ సదుపాయాన్ని కల్పించినట్లయితే ఆ వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది. మీ వ్యక్తిగత వివరాలు పంచుకోవాల్సిన వచ్చినప్పుడు ముందుగా స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.

English summary
It’s a must-read news for people who have LIC policy. Reading this may save you from a big loss. LIC of India has issued an important notification regarding linking of Aadhaar number with your LIC policy through SMS. The notice by LIC has been issued so as to save their customers from fraudulent activities so that people can save their hard-earned money which they have saved for future and important purposes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X