వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తినే పదార్థాలను పేపర్లో చుడుతున్నారా..! ఐతే మీకు క్యాన్సర్ వచ్చినట్టే...!!

|
Google Oneindia TeluguNews

గుంటూరు/హైదరాబాద్ : తినే ఆహార పదార్థాలను వార్తా పత్రికలు లేదా ఏదైన ముద్రణ జరిగిన పేపర్లలో పార్సిల్స్‌ చేయడం, నిల్వ ఉంచడం, నూనె పీల్చేందుకు ఆహార పదార్థాలను వీటిపై ఉం చడం వెంటనే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండెర్ట్స్‌ అధారిటి ఆఫ్‌ ఇండియా) తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లను ఆదేశించింది. ఈ నిషేధాలు జూలై 1 నుంచి అమలు చేయాలని సూచించింది. అప్పటి వరకు వీటిపై ఆయా వీధి వ్యాపారులు, హోటళ్లు, బేకరీలు తదితర ప్రాంతాలకు వెళ్లి ఆహారశాఖ అధికారులు అవగాహన కల్పిం చాలని సూచించింది.

 పేపర్లో పార్శిల్ చేసిన ఆహారపదార్థాలను తినొద్దు..! తింటే క్యాన్సర్ గ్యారెంటీ..!!

పేపర్లో పార్శిల్ చేసిన ఆహారపదార్థాలను తినొద్దు..! తింటే క్యాన్సర్ గ్యారెంటీ..!!

2016లో ఈ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ఏదైన కాగితంపై తిను బండారాలను ఉంచడం వల్ల వాటిలో విషపూరిత రసాయనాలు, క్యాన్సర్‌ కారకాలు, పదార్థాలపై చేరి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుందని శస్త్రీయంగా నిర్థారించింది. పేపర్లపై ముద్రణకు ఉపయోగించే సిరాలో డయాసోగుటుల్‌ ఫిథలాట్‌, డీఎన్‌బటిల్ల్‌ ఫాథిలేట్‌ అనే రసాయనాలు వినియోగిస్తారు. ఇవి ఎంత కాలమైనా వాటి ప్రభావాన్ని కోల్పోవు. ఆహార పదార్థాలను వీటిలో నిల్వ ఉంచినపుడు ఈ రసాయనాలు వాటిలోకి వెంటనే ప్రవేశించి శరీరంలోకి వెళ్లి కొంత కాలానికి క్యాన్సర్‌ కారకాలుగా మారుతాయని నిర్థారించారు. దీని వల్ల భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు రానున్నాయని అభిప్రాయపడింది.

 ఆహార పదార్థాలు విషతుల్యం..! పేపర్ పార్సిల్ అంత డేంజర్ మరి..!!

ఆహార పదార్థాలు విషతుల్యం..! పేపర్ పార్సిల్ అంత డేంజర్ మరి..!!

పేపర్‌ కవర్లలో ఆహార పదార్థాలను పార్సిల్‌ చేయడం రాజధాని పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలో విచ్చల విడిగా జరుగుతుంది. సమోసాలను పేపర్లపైనే ఇస్తు న్నారు. వేడిగా ఉండే సమోసాలు పేపర్‌పై ముద్రించి ఉన్న అక్షరాల్లోని రసా యనాలు చర్యకు గురవుతాయి. ఆ రసాయ నాలు నేరుగా ఆ పదార్థంలోకి చేరుతాయి. ఎక్కువగా వీధి బండ్ల వద్ద పేపర్‌పై టిఫిన్‌ పెట్టి చట్నీ కోసం ప్లాస్టిక్‌ కవర్‌ను వినియోగిస్తున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దాదాపు 80 శాతం పార్సిల్స్‌ ఈ విధంగానే జరుగుతు న్నాయి.

 వార్తా పత్రికల కవర్లలో పార్శిల్‌ వద్దేవద్దు..! తింటే గోవిందా అనాల్సిందే..!!

వార్తా పత్రికల కవర్లలో పార్శిల్‌ వద్దేవద్దు..! తింటే గోవిందా అనాల్సిందే..!!

దీంతో మనం తినే ఆహారమే కాకుండా పార్సిల్స్‌ ద్వారా అనారోగ్య కారకాలను శరీరంలోకి పంపుతున్నాం. వీటన్నింటి కన్నా ప్రమాదకరంగా ఈ సంస్థ మరో పద్ధతిని గుర్తించింది. అదే నూనె పీల్చడం కోసం పేపర్లను వినియోగించడం ఇది దాదాపు 95 శాతం హోటల్స్‌, గృహాల్లో కూడా జరుగుతుంది. ముఖ్యంగా గారెలు, వడలు, వంటి నూనె లో మగ్గిన వస్తువులను వెంటనే వినియోగదా రుడికి అందించకుండా ఆ నూనె పీల్చేందుకు ఈ పేపర్లను వినియోగిస్తున్నా రు. వాస్తవానికి వీటి కోసం ప్రత్యేకమైన టిష్యూ పేపర్లను వినియోగించాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ పద్ధతి లేదు.

క్యాన్సర్‌ కారకాలుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ధారణ..! అప్రమత్తంగా ఉండకపోతే అనంతలోకాలకే..!!

క్యాన్సర్‌ కారకాలుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ధారణ..! అప్రమత్తంగా ఉండకపోతే అనంతలోకాలకే..!!

దీని వల్ల మరింత ప్రమాదం పొంచి ఉందని ఆహార భద్ర తా సంస్థ అభిప్రాయపడింది. ఈ వేడిలో ఉన్న నూనెను నేరుగా ఈ ముద్రణ జరిగిన కాగితాలపై ఉంచడం వల్ల ఆ వేడికి కొన్ని సెకన్ల కాలంలోనే దానిలోని రసాయనాలు ఆహార పదార్థాల్లోకి చేరుతాయని అభిప్రాయపడింది. అందువల్ల వేడి నూనెలో నుంచి తీసిన ఆహార పదార్థాలను ఎటువంటి పరిస్థితులోనూ ముద్రణ జరిగిన కాగితాలపై ఉంచకూడదని ఆదేశించింది.

English summary
The FSSAI (Food Safety and Standards Authority of India) has recently ordered all states and Union Territories to ban food items in newspapers or any print papers to parcel them, store and nourish food.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X