వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆషికి-2 సింగర్ అర్జీత్‌కు గ్యాంగ్‌స్టర్ వార్నింగ్!

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ ప్రముఖ సింగర్ అర్జీత్ సింగ్ కు మాఫియా డాన్ రవి పూజారి నుండి బెదిరింపు ఫోన్ లు వచ్చాయి. భారీ మొత్తంలో నగదు ఇవ్వకుంటే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని రవి పూజారి అనుచరులు బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనకు బెదిరింపు ఫోన్ లు వచ్చిన మాట వాస్తవమని గాయకుడు అర్జీత్ సింగ్ అంగీకరించాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో రవి పూజారి రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని వెలుగు చూసింది.అయితే ఎంత నగదు డిమాండ్ చేశారనే విషయంపై మీడియాతో మాట్లాడటానికి అర్జీత్ సింగ్ నిరాకరిస్తున్నారు.

ఆషికి-2 సినిమాతో అర్జీత్ సింగ్ పాపులర్ అయ్యాడు. ఆషికి -2 సినిమా ఇతనికి మంచి పేరు తీసుకు వచ్చింది. బాలీవుడ్ లోని సింగర్ ల జాబితాలో అర్జీత్ సింగ్ అగ్రస్థానం పట్టిలో నిలిచాడు. రవి పూజారి విషయంపై అర్జీత్ సింగ్ స్పందించారు.

తనకు గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తే రిసీవ్ చెయ్యనని అన్నాడు. ఇటీవల తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని, చార్జ్ చేసిన వెంటనే ఒక ఫోన్ రావడంతో నెంబర్ చూసుకోకుండ రిసీవ్ చేశానని చెప్పాడు. తరువాత ఒక వ్యక్తి మాట్లాడుతూ రవి పూజారి నీతో మాట్లాడుతారు అన్నాడని వివరించారు.

Arijit Singh claimed he received an extortion call from gangster Ravi Pujari

తరువాత కాన్ఫ్ రెన్స్ కాల్ లో రవి పూజారి మాట్లాడుతూ భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారని అన్నారు. తరువాత రవి పూజారి సంతోషంగా నే మాట్లాడాడని, నా కోసం ఒక పాట పాడుతావా అని అడిగారని అర్జీత్ సింగ్ చెప్పాడు.అయితే రవి పూజారి అనుచరులు మాత్రం నన్ను వేదిస్తున్నారని ఆరోపించాడు.

తనుకు బెదిరింపు ఫోన్ లు వచ్చిన తరువాత పోలీసుల రక్షణ అడగలేదని, మీడియా సైతం ఈ విషయం పెద్దది చెయ్యరాదని అంటున్నాడు. అయితే అర్జీత్ సింగ్ మేనేజర్ ముంబైలోని ఓశివార పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అజిత్ సింగ్ దగ్గర అంత డబ్బు లేదని తెలుసుకున్న రవి పూజారి తన గ్యాంగ్ కోసం ఒక మ్యూజిక్ షో నిర్వహించి నిధులు సేకరించి ఇవ్వాలని చెప్పాడని మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ముంబై పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Popular Hindi film singer Arijit Singh on Monday claimed he received an extortion call from gangster Ravi Pujari, who demanded a "ridiculous amount of money". Reportedly, the "Suno na sangemarmar" hitmaker was asked to give Rs 5 crore. However
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X