వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుచిత వ్యాఖ్యలు: యూపీ సీఎం యోగీపై ఈసీకి మాజీ నేవీ ఛీఫ్ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భారత ఆర్మీని మోడీ సేనగా అభివర్ణించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు మాజీ నేవీ ఛీఫ్ అడ్మిరల్ రామ్‌దాస్. భారత దేశంలోని త్రివిధ దళాలు ఒక వ్యక్తికి కానీ ఒక రాజకీయపార్టీకి కానీ సంబంధించినవి కావని ఆయన అన్నారు. త్రివిధ దళాలపై అనుచిత వ్యాఖ్యలు ఎవరి చేసినా అవి ఆమోదయోగ్యం కాదని అన్నారు. తాను ఎన్నికల ప్రధాన అధికారికి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖను సమర్పించారు.

Armed forces does not belong to any party,Former Navy Chief writes to EC

గత నెలలో కూడా రామ్‌దాస్ ఎన్నికల సంఘానికి ఓ ఫిర్యాదు ఇచ్చారు. త్రివిధ దళాల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు రాజకీయాల కోసం భారత సైన్యం చేపట్టిన దాడులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోరాదంటూ ఎన్నికల సంఘం చెప్పడాన్ని రాందాస్ అభినందించారు.

గంభీర్‌కు ఒమర్ అబ్దుల్లా కౌంటర్: ఐపీఎల్‌పై ట్వీట్లు చేయి.... జమ్మూకశ్మీర్ గురించి కాదుగంభీర్‌కు ఒమర్ అబ్దుల్లా కౌంటర్: ఐపీఎల్‌పై ట్వీట్లు చేయి.... జమ్మూకశ్మీర్ గురించి కాదు

ఆదివారం ఘజియాబాదులో జరిగిన ఓ ర్యాలీలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పుల్వామా దాడుల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులకు బిరియాని తినిపించారని అదే మోడీ హయాంలో మోడీ సైనికులు బుల్లెట్లు, బాంబులును ఉగ్రవాదులకు తినిపించారని చెప్పారు. ఇదే కాంగ్రెస్‌కు బీజేపీకి ఉన్న తేడా అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉగ్రవాదులను గౌరవంగా కాంగ్రెస్ సంబోధిస్తోందంటూ జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను రాహుల్ గాంధీ మసూద్ గారు అని పిలవడాన్ని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడమే కాదు పాక్ భరతం కూడా పడుతోందని అన్నారు.

English summary
Former Navy Chief Admiral L Ramdas has approached the Election Commission against Uttar Pradesh Chief Minister Yogi Adityanath’s remark at a rally on Sunday in which he called the Indian Army “Modiji ki Sena”. Ramdas said the armed forces do not belong to any individual or political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X