వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడల్‌ను ఇంట్లో బంధించి, పెళ్లి కోసం తుపాకీతో బెదిరించి, 12 గంటలు పోలీసుల తిప్పలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ముప్పై ఏళ్ల వ్యక్తి ఓ మోడల్‌ను తుపాకీతో బెదిరించి ఆమె ఇంట్లోనే బందీగా చేసుకున్నాడు. ఆమెను తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. ఉదయం ఏడు గంటల సమయంలో బంధించి పోలీసులను 12 గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టాడు.

ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు అతను బంధించినట్లు గుర్తించారు. భోపాల్‌లోని మిస్రోడ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అలీగఢ్‌కు చెందిన రోహిత్ సింగ్.. మోడల్‌గా పని చేస్తున్న ఆ యువతిని నిర్బంధించినట్లు తెలిపారు. ఉదయం ఏడు గంటల సమయంలో ఆమె ప్లాట్‌లోకి వచ్చాడు.

Armed man holding a woman model hostage in Madhya Pradesh

ఆ మోడల్, బందించిన యువకుడు ప్రేమికులను, పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆమె పెళ్లికి నిరాకరించిందని పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని నాటు తుపాకీతో బెదిరించాడని పేర్కొన్నారు.

వీడియో కాలింగ్‌ ద్వారా అతడితో మాట్లాడామని, సాయంత్రం ఆరు గంటల తర్వాత తమను లోపలకు రానిచ్చాడని తెలిపారు. అదే సమయంలో పెళ్లికి యువతిని కూడా ఒప్పించాడని చెప్పారు. ఈ మేరకు ఆమెతో స్టాంప్‌ కాగితంపై సంతకం కూడా చేయించుకున్నాడన్నారు.

టెక్నాలజీలోని మాస్టర్స్ డిగ్రీ చదువుకున్న ఆ మోడలు ఒకసారి ముంబైలో మోడలింగ్ అసైన్‌మెంట్‌కు సంబంధించి రోహిత్‌ను కలుసుకున్నట్టు తెలుస్తోంది.

English summary
An armed man is holding a woman model hostage in an apartment building here in Madhya Pradesh since this morning, demanding that she marry him, according to the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X