వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టపగలే భారీ దోపిడీ: గోల్డ్ లోన్ సిబ్బందిని కట్టేసి, 30 కిలోల బంగారం, 3లక్షలతో పరారీ

|
Google Oneindia TeluguNews

లుధియానా: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ గోల్డ్ లోన్ సంస్థలోకి చొరబడి సిబ్బందిని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత కార్యాలయంలో భారీ మొత్తంలో నిల్వ ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ భారీ దోపిడీ పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో సోమవారం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మారణాయుధాలతో సంస్థలోకి చొరబడి..

మారణాయుధాలతో సంస్థలోకి చొరబడి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లూథియానాలోని గిల్ రోడ్డు ప్రాంతంలో సోమవారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో నలుగురు దుండగులు ముసుగులు ధరించి ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్(ఐఐఎఫ్ఎల్) బ్రాంచీ కార్యాయలంలోకి చొరబడ్డారు. దుండుగులు సిబ్బందిని మారణాయుధాలతో భయపెట్టి.. ఆభరణాలు భద్రపరిచిన గది తాళాలు తీసుకున్నారు.

30 కిలోల బంగారం, రూ. 3లక్షల నగదుతో..

30 కిలోల బంగారం, రూ. 3లక్షల నగదుతో..

ఆ తర్వాత సిబ్బందిని తాళ్లతో కట్టేసి దాదాపు 30 కిలోల బంగారు ఆభరణాలతోపాటు రూ. 3లక్షల నగదుతో అక్కడ్నుంచి ఉటాయించారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగిపోయిందని చెప్పారు. కాగా, చోరీ సమయంలో నలుగురు ముసుగులు ధరించి కార్యాలయం లోపలికి ప్రవేశించారని, మరొకడు బయట కారులోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

దుండగుల పరారైన తర్వాత అలారం మోగించిన సిబ్బంది..

దుండగుల పరారైన తర్వాత అలారం మోగించిన సిబ్బంది..

ఈ ఘటన జరిగిన సమయంలో ఐఐఎఫ్ఎల్ భద్రతా సిబ్బంది అక్కడ లేరని చెప్పారు. దుండగులు అక్కడ్నుంచి పరారైన వెంటనే ఐఐఎఫ్ఎల్ సిబ్బంది అలారం మోగించారని తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఐఐఎఫ్ఎల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, పక్క ప్లాన్ ప్రకారమే దుండుగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది.

Recommended Video

Viral Video : Elephants Eating Sugarcane In The Truck, Video Goes Viral | Oneindia Telugu
సీసీ కెమెరాల్లో దుండుగులు..

సీసీ కెమెరాల్లో దుండుగులు..


కాగా, దుండుగులు ముసుగులు వేసుకుని ఐఐఎఫ్ఎల్ కార్యాలయంలోకి చొరబడిన దృశ్యాలు, ఆ తర్వాత దోపిడీ చేసిన బంగారంతో బయటికి వచ్చిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జన సంచారం స్వల్పంగా ఉన్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా దొంగలు వ్యవహరించడం గమనార్హం. కాగా, గత 20 రోజుల్లో ఇది రెండో భారీ దోపిడీ కావడం గమనార్హం. జనవరి 29న నలుగురు దుండుగులు ఆయుధాలతో ఓ నగల దుకాణంలో చొరబడి రూ. 80 లక్షల విలువైన 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆ కేసు తేలకపోవడం గమనార్హం.

English summary
In a daring day-light robbery right in the heart of Ludhiana, armed assailants looted 30 kg of gold from the office of a financial services company on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X