వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసిన బీఎస్ఎఫ్

|
Google Oneindia TeluguNews

కోల్ కతా: అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లని సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) అరెస్టు చేశాయి. నిందితుల నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బంగారు బిస్కెట్లు తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.

పశ్చిమ బెంగాల్ లోని మల్దా జిల్లాలో రెండు వేర్వేరు సంఘటనలలో మొత్తం నలుగురు స్మగ్లర్లని అరెస్టు చేశామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ నుండి పిస్తోల్ లు తీసుకు వస్తున్న బుడేబ్ రాయ్, సైఫుల్ మండల్, నిర్మల్ సర్కార్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు.

Arms, Gold Smugglers arrested in west Bengal

వీరి నుండి రెండు పిస్తోల్ లు, భారత్ కు చెందిన10 మొబైల్ సిమ్ కార్డులు, బైక్ స్వాదీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు నిందితులను అప్పగించామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరు బంగ్లాదేశ్ నుండి పిస్తోల్ లు ఎందుకు తీసుకు వచ్చారు అని ఆరా తీస్తున్నారు.

అదే విధంగా మరొ చోట రతన్ బిస్వాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను రూ. 84 లక్షల విలువైన 29 బంగారు బిస్కెట్ లు బంగ్లాదేశ్ నుండి తీసుకు వస్తున్నాడని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. ఇతని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Border Security Force (BSF) arrested four alleged Bangladeshi smugglers from the Indo-Bangla border in west Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X