వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రియల్ లైఫ్ లో గూఢచారులు ఎలా ఉంటారో తెలుసా?

|
Google Oneindia TeluguNews

గూఢచారి అనగానే... ఏ అడవి శేష్ సినిమానో.. జేమ్స్ బాండో లేదా 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజ్ లో ఈథన్ హంట్ క్యారెక్టరో.. ఇంకా మహేశ్ బాబు 'స్సైడర్' సినిమానో గుర్తుకొస్తే అది మన తప్పు కాదు. ఎందుకంటే స్పై క్యారెక్టర్లంటే చేతినిండా ఆయుధాలు.. చుట్టూ అందమైన అమ్మాయిలతో కళ్లకు కావాల్సినంత గ్లామర్.. ఉంటుందని మన సినిమావాళ్లు చూపెడతారు. కానీ రియారిటీలో గూఢచారుల జీవితాలు.. సినిమాల్లో చూపించిన దానికి పూర్తి భిన్నంగా ఉంటాయని చెప్పారు కాబోయే ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ నరవాణె.

వాళ్లే లేకపోతే ఆర్మీ ఆపరేషన్లే ఉండవు

వాళ్లే లేకపోతే ఆర్మీ ఆపరేషన్లే ఉండవు

నిఘా సంస్థలు, గూఢచారులే లేకపోతే ఆర్మీ ఆపరేషన్లేవీ సక్సెస్ అయ్యేవికావని నరవాణె అంటారు. పక్కా ఇంటెలిజెన్స్, మిలిటరీ ఆపరేషన్లు ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయంటారు. ఆర్మీలో హై లెవల్ మీటింగ్స్ జరిగే ప్రతిసారి.. మొట్టమొదట మాట్లాడుకునేది గూఢచారుల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ గురించేనని ఆయన చెబుతారు. భారత విదేశీ నిఘా సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)'కు మొట్టమొదటి చీఫ్ గా సేవలందించిన ఆర్.ఎన్.కావ్ జీవితంపై ప్రముఖ జర్నలిస్ట్ నితిన్ గోఖలే రాసిన ‘ఆర్ఎన్ కావ్: జెంటిల్మెన్ స్పైమాస్టర్' పుస్తకావిష్కరణ సభ శనివారం పుణెలో జరిగింది. ఆ సభకు చీఫ్ గెస్టుగా వచ్చిన నరవాణే పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

జార్జ్ స్మైలీ క్యారెక్టర్ కు దగ్గరగా ఉంటారు..

జార్జ్ స్మైలీ క్యారెక్టర్ కు దగ్గరగా ఉంటారు..

రియల్ లైఫ్ లో స్పైలు జేమ్స్ బాండ్లలాగా ఉండరుగానీ.. బ్రిటిష్ రైటర్ జాన్ లీ కర్ నవల్లోని ‘జార్జ్ స్మైలీ‘ క్యారెక్టర్ కు దగ్గరగా ఉంటారని నరవాణె తెలిపారు. గూఢచారులు ముడో కంటికి తెలీకుండా బోలెడంత ఇన్ఫర్మేషన్ ను సేకరించి, దాన్నివిశ్లేషించుకుని, ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాతే దాన్ని వెల్లడిస్తారని గుర్తుచేశారు. ఆర్.ఎన్.కావ్ లాంటి ఎంతోమంది స్పైలు మన దేశానికి ఎన్నోరకాలుగా సేవలందించారని, వాళ్ల జీవితాలపై పుస్తకాలు రావడం సంతోషించదగ్గ విషయమని కాబోయే ఆర్మీ చీఫ్ అభిప్పాయపడ్డారు.

84 ఏండ్లలో ఆయన కనిపించింది రెండేసార్లు !

84 ఏండ్లలో ఆయన కనిపించింది రెండేసార్లు !

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 22 ఏండ్ల తర్వాతగానీ ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా' ఏర్పాటైంది. ఆ సంస్థకు తొలి చీఫ్ గా సేవలందించిన ఆర్.ఎన్.కావ్.. నిత్యం వార్తల్లో ఉంటూ, ప్రధానితో దగ్గరిగా వ్యవహరిస్తూ కూడా.. తన 84 ఏండ్ల జీవితంలో కేవలం రెండు సార్లు మాత్రమే ఫొటోలకు చిక్కారంటే ఎంత జాగ్రత్తగా, అప్పమత్తంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. నెహ్రూ హయాం నుంచి రాజీవ్ గాంధీ హయాం దాకా దేశ ఇంటెలిజెన్స్ వ్యవహారాల్లో కావ్ హవా కొనసాగింది. ఆయన జీవితంపై వచ్చిన ‘ఆర్ఎన్ కావ్: జెంటిల్మెన్ స్పైమాస్టర్' పుస్తకం అమెజాన్, ఫ్లిక్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీనికి ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముందుమాట రాశారు.

English summary
do you know how a real spy work like? here, Army Chief Designate Lt. General Manoj Naravane tells us
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X