వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధ మేఘాలు .. కమాండర్ల సదస్సు నిర్వహిస్తున్న ఆర్మీ చీఫ్ నరవాణే .. అజెండాలో లడఖ్‌ ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

ఒకపక్క భారత చైనా బోర్డర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్మీ అధికారులతో చర్చలు జరిపి యుద్దానికి సిద్ధంగా ఉండేలా సైన్యాన్ని రెడీ చేయాలని పిలుపునిచ్చారని సమాచారం. ఇక ఈ నేపధ్యంలో నేడు జరుగుతున్న భారత కమాండర్ల సదస్సుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక నేడు ప్రారంభమైన కమాండర్ల సదస్సుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అధ్యక్షత వహిస్తున్నారు.

యుద్ధానికి రెడీ అవుతున్న చైనా .. అలెర్ట్ అయిన ఇండియా .. ఈ సమయంలో ఎందుకిలా ?యుద్ధానికి రెడీ అవుతున్న చైనా .. అలెర్ట్ అయిన ఇండియా .. ఈ సమయంలో ఎందుకిలా ?

ఉత్కంఠగా జరుగుతున్న కమాండర్ల సదస్సు .. లడఖ్‌లో ఉద్రిక్తతపై చర్చ

ఉత్కంఠగా జరుగుతున్న కమాండర్ల సదస్సు .. లడఖ్‌లో ఉద్రిక్తతపై చర్చ

మొత్తం మూడు రోజుల పాటు జరగనున్న సమావేశంలో, భారత ఆర్మీ తాజా పరిస్థితుల నేపధ్యంలో తమ వద్ద ఉన్న శక్తి , మన సైనిక బలగాలతో పాటు భద్రతా సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. లడఖ్‌లో చైనా సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తత గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. చైనా సైన్యం యొక్క బలానికి సరిపోయే విధంగా భారత సైన్యం తన దళాల ఉనికిని పెంచుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది , ఇక భారత సైన్యం ఇప్పటికే లడఖ్ సెక్టార్‌లోని వివిధ ప్రదేశాలలో 5,000 మంది సిబ్బందిని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసి) లో నియమించింది.

వ్యూహాత్మకంగా చైనాను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్న భారత్

వ్యూహాత్మకంగా చైనాను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్న భారత్

కరకోరం పాస్ కు దక్షిణాన ఉన్న చివరి సైనిక పోస్ట్ దౌలత్ బేగ్ ఓల్డి సమీపంలో నిర్మిస్తున్న వ్యూహాత్మక వంతెన చుట్టూ సైనిక బలగాలు కేంద్రాలు ఏర్పాటు చేసి భారత భూభాగంలోకి చైనా చొరబాటును అడ్డుకునే యత్నం చేస్తుంది . మరియు చైనా భారత దేశానికి విసిరిన సవాలును బలం మరియు నిగ్రహంతో ఎదుర్కోవాలనే ఆలోచనతో దళాల కదలిక కొనసాగుతుంది .

 బోర్డర్ ఉద్రిక్తతపై బిపిన్ రావత్, పిఎం మోడీల చర్చ

బోర్డర్ ఉద్రిక్తతపై బిపిన్ రావత్, పిఎం మోడీల చర్చ

ఎల్‌ఐసి వెంట పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్‌లతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. లడఖ్ పరిస్థితిని పరిష్కరించడానికి సైనిక బలం ఎంత ఉంది అలాగే యుద్ధానికి వెళ్తే పరిస్థితి ఏంటి వంటి అనేక అంశాలపై సూచనలు సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ పిఎం మోడీకి వివరించారు.లడఖ్‌లో లేదా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వద్ద చైనా దళాలను సమీకరించడం వల్ల ఎదురయ్యే ముప్పును ఫేస్ చెయ్యటానికి భారత్ నిర్ణయించింది.

కొనసాగుతున్న అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్ల సదస్సు

కొనసాగుతున్న అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్ల సదస్సు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ, నేవీ, వైమానిక దళ చీఫ్లతో సమావేశమయ్యారు. ఎల్ఏసి వద్ద ఆర్మీ మోహరింపుకు ప్రస్తుతం భారత సైన్యం సరిపోతుందని సోర్సెస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్లు తమ రెండవ వార్షిక సమావేశం కోసం బుధవారం సౌత్ బ్లాక్‌లో సమావేశమయ్యి అక్కడ వారు లడక్ వద్ద భద్రతా పరిస్థితులపై చర్చిస్తున్నారు .

English summary
Army Chief General Manoj Mukund Naravane is presiding over the Commanders’ Conference that began on Wednesday.During the three-day meeting, the top brass of the force is likely to discuss security issues along with other points. The stand-off at the border with China in Ladakh is also likely to be discussed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X