వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లడాఖ్‌ వద్ద చైనా సైనికుడిని అరెస్టు చేసిన భారత బలగాలు

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతల్ని నివారించే క్రమంలో కీలక అడుగు పడింది. రెండు దేశాల సైనిక కార్ప్స్ కమాండర్ల మధ్య 13 గంటలపాటు సాగిన ఆరో దఫా చర్చలు చివరికి ఫలవంతమయ్యాయి. ఈ మేరకు అంగీకారం కుదిరిన అంశాలపై భారత్, చైనా ఉమ్మడి ప్రకటన చేశాయి. తొలిసారి సైనిక చర్చల్లో భాగం పంచుకున్న విదేశాంగ శాఖ ఈ మేరకు గురువారం కీలక అంశాలను వెల్లడించింది.

Army Colonel, 2 jawans killed in violent face-off with Chinese troops live updates

ఇకపై లదాక్ లోని ఫ్రంట్ లైన్ కు అదనపు బలగాల తరలింపును తరలించకూడదని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అలాగే, మాస్కో వేదికగా రెండు దేశాల విదేశాంగ శాఖల మంత్రులు కుదుర్చుకున్న 'ఐదు సూత్రాల ఫార్ములా'ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే అంగీకారానికి వచ్చాయి.భారత్ చైనా దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్

Recommended Video

    India-China Stand Off : China ను దెబ్బ తీసేలా LAC వద్ద Nirbhay Missile ‌ను మోహరించిన భారత్!

    Newest First Oldest First
    1:44 AM, 20 Oct

    ఈనెల 6న జపాన్ రాజధాని టోక్యోలో భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్టేలియా విదేశాంగ మంత్రులు సమావేశమై మలబార్ ఎక్సర్‌సైజ్ పై కీలక చర్చలు జరిపారు. ఈ నెల 26-27తేదీల్లో భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగనున్నాయి.
    1:44 AM, 20 Oct

    ఇండో-పసిఫిక్‌ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్‌ నావిగేషన్‌ పరిరక్షించడమే భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్టేలియాల లక్ష్యమని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తద్వారా ఈ రీజియన్ లో చైనా ఆధిపత్యానికి చెక్‌ చెప్పనున్నట్లు పరోక్షంగా హెచ్చరించారు.
    10:49 PM, 19 Oct

    అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి నౌకాదళ విన్యాసాలు
    10:21 PM, 19 Oct

    తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపుతో వ్యుహాత్మకంగా వ్యవహారిస్తోన్న భారత్
    8:37 PM, 19 Oct

    చైనాతో ఉద్రిక్త నేపథ్యంలో ఆస్ట్రేలియాకు ఆహ్వానం పలకడంపై ప్రాధాన్యం
    7:27 PM, 19 Oct

    మలబార్ నౌకాదళ విన్యాసాల్లో భాగస్వామ్యం కానున్న అమెరికా, జపాన్..
    6:41 PM, 19 Oct

    మలబార్ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనాలని ఆస్ట్రేలియాకు భారత్ ఆహ్వానం
    4:06 PM, 19 Oct

    చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన ఓ సైనికుడిని భారత జవాన్లు బంధించారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు.
    3:53 PM, 19 Oct

    భారత్‌పై డ్రాగన్ కంట్రీ గూఢచర్యానికి పాల్పడినట్లు సమాచారం
    3:52 PM, 19 Oct

    భారత్‌‌ను దొంగదెబ్బ తీయడానికి చైనా కుట్ర పన్నినట్టు అనుమానాలు
    3:32 PM, 19 Oct

    లడాఖ్‌ వద్ద చైనా సైనికుడిని అరెస్టు చేసిన భారత బలగాలు
    1:54 AM, 3 Oct

    సైనిక చర్చల్ని ఇకపైనా కొనసాగించాలని దౌత్య చర్చల్లో రెండు దేశాలు భావిస్తున్నాయని, సరిహద్దులో వివాదాల పరిష్కారం కోసం లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి తదుపరి (7వ రౌండ్) చర్చలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని ఇరు పక్షాలు అంగీకరించినట్లు ఎంఈఏ తెలిపింది.
    9:36 PM, 1 Oct

    ఓ వైపు చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే.. మరోవైపు పాక్ రెచ్చిపోతోంది. పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడింది. పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. గురువారం జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది.
    8:09 PM, 1 Oct

    కమాండర్ స్థాయిలో తరచూ చర్చలు జరుగుతూ అదే సమయంలో రెండు దేశాలమధ్య కమ్యూనికేషన్ పెరగాలని చెప్పిన చైనా
    8:08 PM, 1 Oct

    రెండు దేశాల మధ్య చర్చలు సామరస్యంగా జరగాలని కోరిన చైనా
    3:29 PM, 1 Oct

    16వేల అడుగుల ఎత్తులో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికుల కోసం దుస్తులు, టెంట్లు, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్‌లతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను తరలించిన భారత ఆర్మీ
    3:28 PM, 1 Oct

    లడాఖ్‌లో పలు సున్నితమైన ప్రాంతాలకు మిలటరీ ఎక్విప్‌మెంట్ ఆయుధాలను తరలించిన భారత ఆర్మీ
    3:27 PM, 1 Oct

    చైనా బలగాలు సరిహద్దు దాటి ముందరకు చొచ్చుకువస్తే భారత్ కాల్పులు జరిపేందుకు సిద్ధంగా ఉందంటూ చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది
    2:09 AM, 1 Oct

    సైనిక చర్చల్ని ఇకపైనా కొనసాగించాలని దౌత్య చర్చల్లో రెండు దేశాలు భావిస్తున్నాయని, సరిహద్దులో వివాదాల పరిష్కారం కోసం లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి తదుపరి (7వ రౌండ్) చర్చలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని ఇరు పక్షాలు అంగీకరించినట్లు ఎంఈఏ తెలిపింది.
    2:08 AM, 1 Oct

    భారత్-చైనా మధ్య బుధవారం దౌత్యపరమైన చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుత పరిస్థితిని ఇరు పక్షాలు సమీక్షించాయి. సరిహద్దుల్లోని ఉద్రిక్తతలకు తెర దించడానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీలు రష్యాలో జరిపిన చర్చల్లో రూపొందించిన ఐదు సూత్రాలపై ప్రధాన దృష్టితో ఈ చర్చలు జరిగాయి.
    7:29 PM, 30 Sep

    విస్తరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ పీజే-10 ప్రాజెక్టులో భాగంగా ఈ క్షిపణిని పరీక్షించారు. ఈ క్షిపణిని దేశీయ బూస్టర్‌తో ప్రయోగించడం గమనార్హం. విస్తరించబడిన తర్వాత ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ను పరీక్షించడం ఇది రెండోసారి.
    5:29 PM, 30 Sep

    భారత్ చైనా సరిహద్దుల్లో ముందస్తు చర్యల్లో భాగంగా యుద్ధ ట్యాంకులు, క్షిపణులను మోహరిస్తున్న భారత్
    5:28 PM, 30 Sep

    తూర్పు లడాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరుదేశాల అధికారులు దౌత్యపరమైన చర్చలు జరిపే అవకాశం
    5:26 PM, 30 Sep

    గాల్వాన్ ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు పలు మార్లు మిలటరీ స్థాయిలో భారత్ చైనా దేశాల మధ్య చర్చలు జరిగాయి
    10:03 PM, 29 Sep

    లదాక్ లోని పలు భూభాగాలు తనవిగా పేర్కొంటూ, అందుకు 1959 నాటి ఒప్పందాలను సాక్ష్యాలుగా చూపుతూ చైనా విదేశాంగ చేసిన ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. ఈ మేరకు చైనా అధికారిక పత్రికలో ప్రచురించిన కథనాలపై బుధవారం స్పందించిన భారత విదేశాంగ శాఖ(ఎంఈఏ) సదరు వాదనను తిరస్కరించింది.
    10:02 PM, 29 Sep

    వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కు సంబంధించి చైనా చేస్తోన్న అడ్డగోలు వాదనను భారత్ ఖండించింది.
    8:50 PM, 29 Sep

    సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుస్సాహాసాలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్ ఎప్పటికప్పుడు వేగంగా స్పందిస్తోందని తెలిపారు.
    4:59 PM, 29 Sep

    వాస్తవాధీన రేఖ అంటే ఏమిటో వివరించిన చైనా వైఖరిని తప్పుబట్టిన భారత్
    2:54 PM, 29 Sep

    భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం లేదు అలా అని శాంతియుత వాతావరణం లేదు. ఏది ఏమైనప్పటికీ ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు భద్రతాదళాలు సిద్ధంగా ఉన్నాయి: ఎయిర్‌ చీఫ్ ఆర్‌కేఎస్ బదౌరియా
    1:37 PM, 29 Sep

    ముందస్తు చర్యల్లో భాగంగా నిర్భయ్, ఆకాష్ లాంటి క్షిపణులను లడాఖ్‌లో మోహరించిన భారత సైన్యం
    READ MORE

    English summary
    A Colonel-rank officer of the Indian Army and two soldiers have died in a violent face-off with Chinese troops in Galwan Valley in Ladakh.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X