వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్ర దాడి సూత్రధారిని అంతమొందించాం .. పుల్వామా దాడిపై ఆర్మీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ఢీ కొని జవాన్ల మరణానికి కారణమైన సూత్రధారి కమ్రాన్ అలియాస్ ఘజి రషీద్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టామని భారత ఆర్మీ ప్రకటించింది. సోమవారం 16 గంటలపాటు జరిగిన భీకర ఎన్ కౌంటర్ .. చనిపోయిన ముష్కరుల వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించింది. పుల్వామా దాడి సూత్రధారి కమ్రాన్ అని అతను కశ్మీర్ లో జైషే మహ్మద్ ఆపరేషన్ చీఫ్ గా వ్యవహరించాడని తెలిపింది.

Army confirms Pakistans terror role .. says army

పౌరులు ఎవరూ చనిపోలేదు ..
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై చేసిన దాడిని ఖండించింది. గతంలో ఎన్నడూ ఇలా కారు బాంబు పేలుడు జరగలేదని వివరించింది. ఉగ్రదాడులపై విచారణ వేగంగా జరుగుతోందని వెల్లడించింది. దాడికి ప్రతీగా సోమవారం ఆర్మీ చేసిన దాడిలో సాధారణ పౌరులు ఎవరూ చనిపోలేదని ఆర్మీ స్పష్టంచేసింది.

నేడు భారత్ కు సౌదీ యువరాజు ..
పుల్వామా దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నేడు భారత్ పర్యటనకు వస్తున్నారు. తొలిసారి భారత్ వస్తున్న ఆయన .. వివిధ అంశాలపై ప్రధాని మోదీపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న సిచుయేషన్ నేపథ్యంలో .. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తుందనే అంశాన్ని చర్చల సందర్భంగా భారత్ లేవనెత్తనుంది. ఇదే అంశంపై జరిగే ద్వైపాక్షిక జరిగే చర్చల్లో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం కోసం ఒప్పందం జరిగే అవకాశం ఉంది.

English summary
The Indian Army has announced that two other terrorists, including Kamran alias Ghazi Rashid, the mastermind of the deaths of CRPF convoy in Pulwama, were killed. Monday's 16-hour encounters reported the death toll from the dead. Kamran is the chief of the Pulwama attack and said that he was Jaisce Mohammad's Operation Chief in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X