వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ మోదీకి చెందినది కాదు, దేశం హక్కు : అమరిందర్ సింగ్

|
Google Oneindia TeluguNews

సంగ్రూర్ : ప్రధాని మోదీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్. భారత ఆర్మీ చేపట్టిన విజయాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బాలాకోట్ లోని ఉగ్ర శిబిరాలపై వాయుసేన చేసిన దాడులను వాడుకొని ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆయన శుక్రవారం సంగ్రూరులో ప్రచారం నిర్వహించారు.

Army does not belong to Modi, it is for the nation

దేశం హక్కు
బాలాకోట్ దాడుల తర్వాత మోదీ ఆర్మీని తనదని ప్రకటించుకున్నారని .. అంతకుముందు ఏమైంది ఈ ప్రేమ అని ప్రశ్నించారు. అయినా ఆర్మీ అనేది మోదీ ఒక్కరికి చెందినది కాదు .. దేశానికి సంబంధించినది అని స్పష్టంచేశారు. తాను కూడా ఇదివరకు భారత సైన్యంలో పదేళ్లు పనిచేశానని గుర్తుచేశారు. తాను కూడా దేశం కోసం పనిచేశానే తప్ప మోదీ కోసం కాదని సెటైర్లు వేశారు.

మీరు చేయనిది .. మేం చేశాం ...
ఇదివరకు పంజాబ్ ప్రభుత్వం అవలంభించిన విధానాలతోనే రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. మాజీ పంజాబ్ ఆర్థికమంత్రి పరమిందర్ సింగ్ విధానాల వల్ల రాష్ట్రం రూ.31 వేల కోట్ల అప్పుల్లో కురుకుపోయిందని చెప్పారు. కానీ తాము అధికారం చేపట్టిన వెంటనే రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదివరకు సీఎంగా ఉన్న ప్రకాశ్ సింగ్ బాదల్ ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు.

ఆప్ అభ్యర్థిపై కూడా ...
బీజేపీతోపాటు సిట్టింగ్ ఆప్ ఎంపీ భగ్ వత్ మాన్ పై అమరిందర్ సింగ్ విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇప్పుడు వర్సిటీ, కంపెనీ స్థాపిస్తామని కబుర్లు చెప్తున్నారని .. వారి అసత్య ప్రచారాలను జనం విశ్వసించబోరని పేర్కొన్నారు.

English summary
Punjab chief minister Captain Amarinder Singh has attacked Prime Minister Narendra Modi for trying to take “political mileage” over the achievements of the Indian Army, especially after the air strike on a Jaish-e-Mohammad terror camp in Pakistan’s Balakot. The chief minister was addressing a rally in support of Kewal Singh Dhillon, the Congress candidate from Sangrur, in Sunam on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X