వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామాలో తుపాకుల మోత.. నలుగురు సైనికులు మృతి

|
Google Oneindia TeluguNews

పుల్వామా : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే.. కశ్మీర్ లో మళ్లీ అలజడి రేగింది. పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ ఏరియాలో ముష్కరులు మరోసారి పంజా విసిరారు. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్ తో పాటు ముగ్గురు జవాన్లు నెలకొరిగారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం మరింత అప్రమత్తమైంది. ఆ క్రమంలో ఉగ్రవాదుల వేటలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. టెర్రరిస్టులు ఓ ప్రాంతంలో దాక్కున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఆర్మీ సిబ్బంది సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కనిపించడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ముష్కరుల దాడితో సైనికులు మృత్యువాత పడ్డారు.

Army Major among 4 soldiers killed in Pulwama encounter on monday
English summary
The encounter broke out in Pinglan area of Pulwama district in South Kashmir after the militants fired upon security forces. Fresh firing has started again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X