• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శైలజ-మేజర్ మధ్య ఆర్నెళ్లలో 3500 కాల్స్, అక్కడ్నుంచి వచ్చేసి టచ్‌లో: వీడియో కాల్‌లో పట్టేసిన భర్త

By Srinivas
|
  పెళ్లి చేసుకోలేదని మరో మేజర్ భార్య హత్య, వివాహేతర సంబంధం!

  న్యూఢిల్లీ: ఆర్మీ మేజర్ హండా మరో ఆర్మీ అధికారి భార్యను హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడు హండాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మరింత విచారణ కోసం అతనిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఢిల్లీ కోర్టు అతనిని నాలుగు రోజుల కస్టడీకి అప్పగించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ త్రిపాఠి మేజర్ నిఖిల్ హండాను కస్టడీకి అనుమతించారు.

  చదవండి: మేజర్ చేతిలో హత్య: ఆమె మిసెస్ ఇండియా ఫైనలిస్ట్, 'సంతోషంగా జీవించే శైలజ'

  సోమవారం పోలీసులు గట్టి భద్రత మధ్య అతనిని కోర్టులో హాజరుపరిచారు. అతనిని కస్టడీలోకి తీసుకొని, మీరట్ తీసుకు వెళ్లి, హత్య చేసిన సమయంలో వేసుకున్న దుస్తులు, హత్యకు ఉపయోగించిన ఆయుధం, మరేమైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకోనున్నారు.

  ఆర్మీ మేజర్ దారుణం: పెళ్లి చేసుకోలేదని మరో మేజర్ భార్య హత్య, వివాహేతర సంబంధం!

  ఇద్దరి మధ్య 6 నెలల్లో 3500 కాల్స్

  ఇద్దరి మధ్య 6 నెలల్లో 3500 కాల్స్

  నిందితుడైన మేజర్ నిఖిల్ హండా, హత్యగావించబడిన శైలజ మధ్య గత ఆరు నెలలుగా 3500 ఫోన్ కాల్స్ సంభాషణలు చోటు చేసుకున్నాయని పోలీసులు గుర్తించారు. ఇరువురు కలిసి శనివారం కారులో వెళ్తున్న సమయంలో పెళ్లి విషయంలో వాగ్వాదం జరగడంతో ఆమె గొంతు కోసి చంపేశాడు.

  ముందస్తు ప్లాన్

  ముందస్తు ప్లాన్

  హండా ప్లాన్‌తోనే హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. అతను రెండు స్విస్ కత్తులను తన వెంట తెచ్చుకున్నాడని తెలుస్తోంది. ఆమెను హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి వచ్చి ఆమెపై నుంచి కారు పోనిచ్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన సోదరుడిని కలిసి అతని నుంచి రూ.20,000 తీసుకున్నాడు. సోదరుడికి ఫోన్ చేసినట్లుగా ఉంది.

  కారు ఎక్కిన కాసేపటికే హత్య

  కారు ఎక్కిన కాసేపటికే హత్య

  మరో విషయం ఏమంటే మేజర్ హండా కూడా అంతకుముందు రోజు తన భార్యతో.. శైలజా ద్వివేదీతో సంబంధం విషయంలో గొడవ పడ్డాడని పోలీసులు గుర్తించారని వార్తలు వస్తున్నాయి. మరుసటి రోజు.. శనివారం శైలజకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. గొడవలో హత్య చేశాడు. ఆర్మీ ఆసుపత్రికి వెళ్లిన శైలజ.. ఆ తర్వాత నిందితుడు హండా కారులో ఎక్కింది. సీసీటీవీ ఫుటేజ ఆధారంగా చూస్తే.. ఆమె కారు ఎక్కిన కాసేపటికే హత్యకు గురైంది.

  కారును క్లీన్ చేసి, ఫోన్ పగులగొట్టి

  కారును క్లీన్ చేసి, ఫోన్ పగులగొట్టి

  హత్య సమయంలో నిందితుడు తన హోండా సిటీ కారులో ప్రయాణించాడు. ఆ తర్వాత దానిని పూర్తిగా శుభ్రం చేశాడు. అయితే ఫోరెన్సిక్ నిపుణులు బ్లడ్ శాంపిల్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన ఫోన్‌ను కూడా అతను ముక్కలు చేసి, దగ్గరలోని డంపింగ్‌లో పడేశాడు. కానీ పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు.

  అక్కడి నుంచి వచ్చినా నిందితుడితో టచ్‌లో శైలజ

  అక్కడి నుంచి వచ్చినా నిందితుడితో టచ్‌లో శైలజ

  కారులో నుంచి శైలజా ద్వివేది వెంట్రుకలు, ఫింగర్ ఫ్రింట్స్ తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు హండా తన ఫోన్‌ను ముక్కలు చేయడమే కాకుండా అందులోని కొన్ని యాప్స్ కూడా తొలగించాడని తెలిపారు. వాటిని తిరిగి పొందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హండా, శైలజా ద్వివేదిల మధ్య 2015లో నాగాలాండులో ఉన్నప్పుడు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత తన భర్తకు ఢిల్లీకి ట్రాన్సుఫర్ అయిన తర్వాత కూడా శైలజ నిందితుడు హండాతో టచ్‌లోనే ఉంది.

  భార్యకు, నిందితుడికి మేజర్ గతంలోనే వార్నింగ్

  భార్యకు, నిందితుడికి మేజర్ గతంలోనే వార్నింగ్

  నిందితుడు హండా, తన భార్య శైలజకు భర్త గతంలోనే ఓసారి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. నాగాలాండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా శైలజ.. హండాతో చాలాసేపు మాట్లాడం భర్త గమనించారు. అంతేకాదు, ఓసారి ఇరువురి మధ్య వీడియో కాల్‌ను చూసి వారిని పట్టేశారు. భార్యను హెచ్చరించాడు. మరోసారి తన భార్యతో మాట్లాడితే బాగుండదని హండాను కూడా హెచ్చరించాడు. నా భార్యకు క్లోజ్‌గా మూవ్ కావొద్దని, నా ఇంటికి రావొద్దని హెచ్చరించాడు.

  English summary
  Army Major Nikhil Handa arrested for allegedly killing another officer's wife, was today sent to four-day police custody by a Delhi court. Metropolitan Magistrate Manisha Tripathy granted the custody of Major Nikhil Handa, who was produced before the court amid tight security, to the police who said he has to be taken to Meerut in Uttar Pradesh to make recover his clothes and the weapon used to commit the crime.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more