వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజూ చస్తున్నారు: సైనికులపై బిజెపి ఎంపి నోటి దురుసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

బిజెపి ఎంపి నోటి దురుసు : క్షమాపణలు, వీడియో !

న్యూఢిల్లీ: సైనికుల మరణాలపై బిజెపి పార్లమెంటు సభ్యుడు నేపాల్ సింగ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల చేతిలో ఐదుగురు జవాన్లు మరణించిన సంఘటనపై ఆయన స్పందిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

పోరాటంలో సాయుధ బలగాలు మరణించని దేశమంటూ లేదని, అది నిత్య వ్యవహారమని ఆయన అన్నారు. సరిహద్దులో జవాన్లు శత్రువులతో పోరాడుతుంటారు, చస్తుంటారని, అందులో కొత్తేముందని ఆయన అన్నారు.

Army men die everyday: BJP MP Nepal Singh

సైన్యంలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించినప్పుడు - మరి సైనికుల ప్రాణాలు కాపాడే ఆయుధం ఏదైనా శాస్త్రవేత్తల దగ్గర ఉందా? అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌ లోకసభ సభ్యుడైన 77 ఏళ్ల నేపాల్‌ సింగ్‌ వ్యాఖ్యలతో వివాదం ముదిరింది. తీవ్రమైన విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గక తప్పలేదు. తానేం జవాన్లను, అమరవీరులను అవమానించలేదని, ఒకవేళ అలా అనిపించి ఉంటే క్షమాపణలు చెప్తున్నానని ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చి అన్నారు.

సైనికుల ప్రాణాలు కాపాడేలా ఓ ఆయుధం కనిపెట్టాలని తాను శాస్త్రవేత్తలను కోరానని ఆయన అన్నారు. సైనికులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు.

English summary
BJP MP Nepal Singh sparked controversy after he said that there is no country where armed personnel don’t get killed in a fight and that this is a daily affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X