వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో పాక్ కాల్పులు: ఆర్మీ ఆఫీసర్ మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్ధాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నవ్ గామ్ సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. పాకిస్ధాన్ రేంజర్స్ కాల్పుల్లో ఓ ఆర్మీ ఆఫీసర్ మృతి చెందాడు. పీర్ పంజాల్ వద్ద కూడా భారత ఔట్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు.

మృతి చెందిన ఆర్మీ ఆఫీసర్‌ను జేసీఓగా ఆర్మీ ఆధికారులు గుర్తించారు. సెప్టంబర్ మొదటి వారంలో రెండు దేశాల ఆర్మీ డీజీ స్థాయి చర్చలు జరగనున్న తరుణంలో పాక్ కాల్పులు ఉధృతం చేసింది. దీంతో అప్రమత్తమైన భారత్ బలగాలు పాక్ రేంజర్ల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.

Army officer killed in Pakistani firing near LoC in Nowgam sector of Kashmir

ఈ కాల్పుల ఉల్లంఘన మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. 2003లో కాల్పుల విరమణ ఉల్లంఘన చట్టం వచ్చిన తర్వాత ఈ ఏడాది 245 సార్లు పాకిస్థాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

ఇటీవలే న్యూఢిల్లీలో భారత్-పాకిస్ధాన్ దేశాల మధ్య జరగాల్సిన ఎన్ఎస్ఏ సమావేశం అంశం జరగకపోవడంతోనే పాకిస్థాన్ ఈ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి ఉండొచ్చనని భావిస్తున్నారు.

భారత్-పాకిస్ధాన్ ఎన్ఎస్ఏ సమావేశం అంశంపై గత శనివారం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య చర్చలు జరగపోడానికి పాకిస్ధాన్ వైఖరే కారణమేనని అన్నారు. మే 19న ఉఫాలో భారత్ - పాకిస్థాన్‌ల మధ్య జరిగిన చర్చల్లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు.

English summary
A junior commissioned officer (JCO) of Army was killed on Tuesday in cross-LoC firing by Pakistani troops in Kupwara district of Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X