వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదానికి పిల్లలను దూరంగా ఉంచండి : కశ్మీర్ తల్లులకు ఆర్మీ పిలుపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో జమ్ము, కశ్మీర్ ప్రజలకు ఆర్మీ కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా కశ్మీర్ యువత తీవ్రవాదం, హింస మార్గం వైపు మళ్లేలా చూడొద్దని వారి తల్లులను కోరింది. తీవ్రవాద భావజాలం వైపు వెళ్లి తిరిగొచ్చిన వారిని ఏమీ చేయమని స్పష్టంచేసింది.

తిరిగిస్తే సహకరిస్తాం ..
'మీ పిల్లలను ఉగ్రవాదానికి దూరంగా ఉంచండి .. ఉగ్రవాద గ్రూపుల్లో చేరేవారిని నిరోధించండి. అలాగే ఉగ్రవాద గ్రూపుల్లో చేరిన యువత తిరిగొచ్చేందుకు సుముఖుత వ్యక్తం చేస్తే .. వారికి ఎలాంటి హానీ తలపెట్టబోం' అని భారత లెప్టినెంట్ జనరల్ కన్వాల్ జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు. ఉగ్రవాదా భావజాలం వైపు మళ్లిన వారిని ఉగ్రవాదానికి దగ్గరకానీయకండా చూడాలని కోరారు. వారికి అన్నివిధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.

ఉగ్ర మూకలపై ఉక్కుపాదం : పాకిస్థాన్ కు ఇండియా వార్నింగ్ఉగ్ర మూకలపై ఉక్కుపాదం : పాకిస్థాన్ కు ఇండియా వార్నింగ్

Armys appeal to J&K mothers: Prevent your sons from becoming terrorists

పుల్వామాతో అలర్ట్

కశ్మీర్ లో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్నారు థిల్లాన్. ఆ తర్వాత మాట్లాడుతూ ఉగ్రవాద భావజాలం వైపు మళ్లొద్దని ప్రత్యేకంగా వారి తల్లులను కోరారు. మరోవైపు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర మూకల దాడితో పరిస్థితి మారింది. ఇప్పటికే అలర్టైన సైన్యం ... ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని స్పష్టంచేసింది. అలాగే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్ కు తేల్చిచెప్పింది. దీంతోపాటు కశ్మీర్ యువత ఎక్కువగా అతివాద భావజాలంతో ఉగ్రవాదానికి మళ్లుతున్నారు. ఈ క్రమంలో ఈ అంశాన్ని మొగ్గదశలోనే తుంచి వేద్దామని వారి తల్లులకు విజప్తి చేశారు థిల్లాన్.

English summary
Indian Army Lieutenant General Kanwal Jeet Singh Dhillon on Friday appealed to the mothers in Jammu and Kashmir to ensure their sons do not join terrorism. He also assured the mothers of those who have chosen the path of militancy but want to return, that the Army will ensure their return to the mainstream.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X