Arnab Goswami: అర్నబ్ అండ్ కో పై చార్జ్ షీట్ దాఖలు, 65 మంది సాక్షులు, ముంబాయి పోలీసుల ప్లాన్, కౌంటర్!
ముంబాయి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిపై నమోదైన కేసులో ముంబాయి పోలీసులు కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు. 2018 నాటి అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అరెస్టు అయిన అర్నబ్ గోస్వామి తరువాత కోర్టులో బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో ముంబాయి పోలీసులు అర్నబ్ గోస్వామితో సహ ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీద చార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో సమర్పించారు. ఇప్పటికే కేసు విచారణ నిలిపివేయాలని అర్నబ్ గోస్వామి కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
GHMC Elections 2020 Results: ఇది ట్రైలర్ మాత్రమే, బాహుబలి కంటే పెద్ద సినిమా ఉంటుంది, కుష్బు !

హీరో సుశాంత్ కేసుతో వివాదం
బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు విషయంలో మహారాష్ట్ర సీఎంకు వ్యతిరేకంగా టీవీలో చర్చా కార్యక్రమాలు చేపట్టిన తరువాత అర్నబ్ గోస్వామిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మండిపడతూ వస్తోంది. హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు తరువాత రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు.

తెర మీదకు పాత చింతకాయ పచ్చడి
2018 నాటి అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్ గోస్వామి పేరు తెరమీదకు వచ్చింది. తరువాత జరిగిన నాటకీయ పరిణామాలతో అర్నబ్ గోస్వామి అరెస్టు కావడంతో ఆయన జైలుకు వెళ్లారు. అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చెయ్యకూడదని, కేసు విచారణలో ఉందని, ఆయన పలుకుబడితో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని అప్పట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ముంబాయి పోలీసులు గట్టిగానే కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టులో బెయిల్
అర్నబ్ గోస్వామిని ఎలాగైనా లొంగదీసుకోవాలని ఆయన మీద 2018 నాటి కేసు బయటకు తీశారా ?, సభాహక్కుల నోటీసుల విషయంలో ఆయన తప్పించుకున్నా వేరే మార్గంలో ఆయనకు సినిమా చూపించాలని ఇలా చేశారా ? అంటూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష నాయకులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తరువాత అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చారు.

కోర్టులో చార్జ్ షీట్ దాఖలు
2018 నాటి అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్ గోస్వామితో సహ ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిరోజ్ షేక్, నితీశ్ సర్దా మీద చార్జ్ షీట్ తయారు చేసిన ముంబాయి పోలీసులు కోర్టులో దాఖలు చేశారని ముంబాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఫరాత్ అన్నారు. ఇదే కేసులో ముంబాయి పోలీసులు 65 మందిని సాక్షులుగా చేర్చారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఫరాత్ చెప్పారు.

అర్నబ్ వాదన వేరే ఉంది
2018 నాటి అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసు మళ్లీ విచారణ చెయ్యాలని మహారాష్ట్ర హోమ్ శాఖా మంత్రి అనీల్ దేశ్ ముఖ్ సీఐడీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో రాయగఢ్ జిల్లాలోని ఆలీబాగ్ పోలీసులు ఈ కేసు విచారణ చేశారని, సరైన సాక్షాలు లేనందున కేసు క్లోజ్ చేశారని, మళ్లీ విచారణకు ఆదేశించి తన మీద కక్షసాధిస్తున్నారని అర్నబ్ గోస్వామి కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద మహారాష్ట్ర ప్రభుత్వం, అర్నబ్ గోస్వామిల వివాదం ఎంతవరకు వెలుతుందో వేచి చూడాలి అంటున్నారు న్యాయనిపుణులు.