వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Arnab Goswami: లేడీ పోలీసు ఆఫీసర్ పై దాడి చేశారని ఆర్నబ్ పై మరో కేసు, అరెస్టు చేస్తారని, కోర్టులో!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి మెడకు మరో కేసు చిక్కుకుంది. 2018 మే నెలలో ముంబాయిలో అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యల కేసులో అరెస్టు అయిన అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చారు.

అయితే ముంబాయికి చెందిన ఓ లేడీ పోలీసు అధికారి మీద చెయ్యి చేసుకున్నారని అర్నబ్ గోస్వామి మీద మరో కేసు నమోదు కావడంతో ఇప్పుడు మళ్లీ ఆయన మందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అర్నబ్ గోస్వామిని ముంబాయి పోలీసులు మళ్లీ అరెస్టు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

13 years love: పెళ్లికి మూడు గంటల ముందు ప్రియుడు ఎస్కేప్, వేరే అమ్మాయితో, కంత్రీగాడు!13 years love: పెళ్లికి మూడు గంటల ముందు ప్రియుడు ఎస్కేప్, వేరే అమ్మాయితో, కంత్రీగాడు!

అర్నబ్ ఇంట్లో పోలీసుల రామాయణం

అర్నబ్ ఇంట్లో పోలీసుల రామాయణం

2018 మే నెలలో ముంబాయిలోని ఆలీబాగ్ లో నివాసం ఉంటున్న అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యలు చేసుకున్నారని అప్పట్లో కేసు నమోదైయ్యింది. ఈ కేసులో ముంబాయి పోలీసులు రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామిని ఈనెల 4వ తేదీన ముంబాయిలోని ఆయన ఇంటిలోనే అరెస్టు చేశారు. ఆ సందర్బంలో అర్నబ్ గోస్వామికి, ముంబాయి పోలీసుల మద్య పెద్ద రాద్దాంతం జరిగింది.

బెయిల్ రాకుండా చేశారు

బెయిల్ రాకుండా చేశారు

ముంబాయిలోని ఆలీబాగ్ లో నివాసం ఉంటున్న అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్యలు చేసుకునే ముందు వారిద్దరూ డెత్ నోట్ రాసిపెట్టారని పోలీసులు అంటున్నారు. తమకు రావలసిన రూ. 5.40 కోట్లు ఇవ్వకుండా అర్నబ్ గోస్వామి, మరో ఇద్దరు తమను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆర్థిక సమస్యల కారణంగా తాము ఆత్మహత్యలు చేసుకుంటున్నామని తల్లీ, కుమారుడు డెత్ నోట్ రాసిపెట్టారని ముంబాయి పోలీసులు బాంబే హైకోర్టుటలో వాదించి అక్కడ ఆయనకు బెయిల్ రాకుండా చేశారు.

సుప్రీం కోర్టులో బెయిల్

సుప్రీం కోర్టులో బెయిల్

ముంబాయిలోని ఆలీబాగ్ లో నివాసం ఉంటున్న అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యల కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబాయి పోలీసులు కావాలనే తన మీద కక్షకట్టి కేసులో ఇరికించారని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు కావడంతో జైల్లో ఉన్న అర్నబ్ గోస్వామి జైలు నుంచి బయటకు వచ్చారు.

లేడీ ఆఫీసర్ పైదాడి కేసు

లేడీ ఆఫీసర్ పైదాడి కేసు

అర్నబ్ గోస్వామిని ముంబాయి పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఆయన ఇంటికి కొందరు లేడీ పోలీసులు వెళ్లారు. ఆ సందర్బంలో తన మీద దాడి జరిగిందని, తన విధులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఓ లేడీ పోలీసు అధికారి ఫిర్యాదు చేశారని అర్నబ్ గోస్వామి, ఆయన భార్య మీద ముంబాయిలోని ఎన్ఎం, జోషి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

 బెయిల్ కోసం ప్రయత్నాలు

బెయిల్ కోసం ప్రయత్నాలు

తల్లీ కుమారుడి ఆత్మహత్యల కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన అర్నబ్ గోస్వామి మీద మరో కేసు నమోదు కావడంతో ఆయన షాక్ కు గురైనారని తెలిసింది. ముంబాయి పోలీసులు అర్నబ్ గోస్వామిని మళ్లీ అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారాం జరుగుతోంది. అర్నబ్ గోస్వామి, ఆయన భార్య ఇప్పుడు ముంబాయిలోని మెజిస్ట్రేట్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం వారి న్యాయవాది పీబీ. జాదవ్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు.

English summary
Arab Goswami: Mumbai female Cop assault case, Arnab’s pre-areest bail plea adjourned to NOV 23
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X