వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు నుంచి అర్నాబ్ గోస్వామి విడుదల -విక్టరీ చూపుతూ ఉత్సవాలు -సుప్రీం బెయిల్ ఇవ్వడంతో

|
Google Oneindia TeluguNews

ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ కు చెందిన ఆర్కిటెక్ట్ అన్వ‌య్ నాయ‌క్‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన ఆరోప‌ణ‌ల‌పై ఈ నెల 4న అరెస్టైన అర్నాబ్ బుధవారం ముంబైలోని తలోజా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలకు మార్గం సుగమం అయింది.

 ట్రంప్‌కు ఊరట అలస్కాలో విజయం -ఫలితాలపై పోరు ముమ్మరం -ఎవరూ అడ్డుకోలేరని బైడెన్ గరం ట్రంప్‌కు ఊరట అలస్కాలో విజయం -ఫలితాలపై పోరు ముమ్మరం -ఎవరూ అడ్డుకోలేరని బైడెన్ గరం

అన్వయ్ నాయక్, అతని తల్లి కనికా నాయక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి అర్నాబ్ సహా ఇద్దరు నిందితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, ఇందిరా బెన‌ర్జీతో కూడిన ద్విస‌భ్య ధ‌ర్మాసనం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా బుధవారం విచార‌ణ జ‌రిపింది. అర్న‌బ్‌తోపాటు ఇద్ద‌రు స‌హ నిందితుల‌కు కూడా బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ముగ్గురు నిందితులు వ్య‌క్తిగ‌త పూచీక‌త్తు కింద రూ.50 వేల చొప్పున బాండ్ స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.

 Arnab Goswami released from Mumbais Taloja Jail after sc grants interim bail

నిందితుల విడుదలలో ఎలాంటి జాప్యం చేయరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడంతో కోర్టు కాపీలు అందిన వెంటనే ముంబైలోని తలోజా జైలు అధికారులు.. రిమాండ్‌లో ఉన్న అర్నబ్‌ గోస్వామిని బుధవారం రాత్రి విడుదల చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిమానులకు విక్టరీ సింబల్‌ చూపుతూ ఉత్సవం మాదిరిగా అర్నాబ్ ఇంటికి చేరుకున్నారు.

బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..

రిపబ్లిక్ టీవీ నుంచి బకాయిలు రాకపోవడంతో ఆర్థిక భారం పెరిగి ఆర్కిటెక్ట్ అన్వ‌య్ నాయ‌క్, ఆయన త‌ల్లి 2018లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తమ చావుకు అర్నాబ్ తోపాటు మరో ఇద్దరు కారణమని పేర్కొంటూ వారు సూసైడ్‌ నోట్ రాశారు. నాటి బీజేపీ సర్కార్ ఆ కేసును మూసేయగా, ఇటీవల అన్వయ్‌ నాయక్‌ కుమార్తె అద్వా నాయక్‌ ఉద్ధవ్ ఠాక్రే సర్కారుకు ఫిర్యాదు చేయడంతో ఆ కేసును రీ ఓపెన్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 4న అర్నాబ్ ను అరెస్టు చేశారు.

English summary
On late Wednesday night, Republic Media Network's Editor-in-Chief Arnab Goswami was released from Taloja Jail after spending 7 days in judicial custody. This comes after a division bench of the Supreme Court comprising Justices DY Chandrachud and Indira Banerjee granted him interim bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X