arnab goswami bombay mumbai jail shift high court tv wife bail plea arrest assembly officers notice custody police sc bjp siva sena congress అర్నబ్ గోస్వామి బాంబే ముంబాయి జైలు తరలింపు హైకోర్టు టీవీ భార్య బెయిల్ పిటిషన్ అరెస్టు అసెంబ్లీ అధికారులు నోటీసులు కస్టడీ పోలీసు సుప్రీం కోర్టు కాంగ్రెస్ politics
Arnab Goswami: సోషల్ మీడియా ఎఫెక్ట్, అర్నబ్ ను సరిహద్దులు దాటించి తలోజా జైలుకు, భార్య ఫైర్!
ముంబాయి/ న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి ముంబాయి పోలీసులు సినిమా చూపిస్తున్నారని, ఆయన్ను కించపరుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముంబాయి సరిహద్దులు దాటించి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలోజా జైలుకు అర్నబ్ గోస్వామిని తరలించడంపై అనేక విమర్శలు ఎదురౌతున్నాయి. ఇదే సమయంలో తన భర్త అర్నబ్ గోస్వామి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనపట్ల పోలీసులు, జైళ్లు శాఖ అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య సమ్యాబత్రా రే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Blackmail: ప్రియురాలి నగ్న వీడియోలు తండ్రికి షేర్ చేశాడు, పైగా పండగ చేస్కో అని మెసేజ్, కాలేజ్ !

అర్నబ్ మొబైల్ ఫోన్లు సీజ్
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన సమయంలోనే ఆయన మొబైల్ ఫోన్లు, వ్యకిగత వస్తువులను ముంబాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన తరువాత ఆయన్ను నవీ ముంబాయిలోని ఆలీబాగ్ జైలుకుతరలించారు, అంతకు ముందే అర్నబ్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు.

సోషల్ మీడియా ఎఫెక్ట్ తో జైలుకు షిఫ్ట్
పోలీసుల అదుపులో ఉన్న సమయంలో అర్నబ్ గోస్వామి ఇతరుల మొబైల్ ఫోన్లు ఉపయోగించి మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ముంబాయి పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న అర్నబ్ గోస్వామి ఏలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ? అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు శివసేన నాయకులు ముంబాయి పోలీసులకు చివాట్లు పెట్టారని తెలిసింది. ఆ దెబ్బతో ప్రభుత్వ పాఠశాలలో కరోనా పరీక్షలు చేయించుకున్న అర్నబ్ గోస్వామిని తరువాత ఆలీబాగ్ జైలుకు పంపించారు. ఆలీబాగ్ జైలు నుంచి సమారు 70 కిటో మీటర్ల దూరంలో ఉన్న తలోజా జైలుకు అర్నబ్ గోస్వామిని తరలించారు.

పాతకేసులో అర్నబ్ అరెస్టు
2018 నాటి అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్ గోస్వామిని ముంబాయి పోలీసులు ఐదు రోజుల క్రితం అరెస్టు చేశారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చెయ్యకూడదని, కేసు విచారణలో ఉందని, ఆయన పలుకుబడితో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్, ముంబాయి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు కాలేదు.

తన భర్త ప్రాణానికి ముప్పు
తన భర్తను అరెస్టు చేసి ఐదు రోజులు అవుతోందని, జైలులో ఉన్న సమయంలో జైలు తన మీద దాడి చేశాడని తన భర్త తనకు చెప్పారని అర్నబ్ గోస్వామి భార్య సమ్యాబ్రతా రే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహారాష్ట్ర పోలీసులు, జైళ్ల శాఖ అధికారుల నుంచి తన భర్తకు అర్నబ్ గోస్వామికి ప్రాణహాని ఉందని, ఆయనకు ఏదైనా జరిగితే పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని సమ్యాబ్రతా రే ఆరోపించారు. తన భర్త అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చెయ్యాలని సమ్యాబ్రతా రే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.