వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే ప్రెస్ మీట్ హైలైట్స్ : రాబోయే 10 రోజుల్లో మరో 2600 శ్రామిక్ రైళ్లు..

|
Google Oneindia TeluguNews

మే 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ 2570 శ్రామిక్ రైళ్ల ద్వారా 32లక్షల వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. వీటిల్లో 505 రైళ్లు ఇంకా గమ్య స్థానాలకు చేరాల్సి ఉందని,2065 రైళ్లు ఇప్పటికే గమ్య స్థానాలకు చేరుకున్నాయని తెలిపింది. శ్రామిక్ రైళ్ల నిర్వహణలో 85శాతం ఖర్చును రైల్వేనే భరించిందని.. మిగతా ఖర్చును రాష్ట్రాలు భరించాయని పేర్కొంది. జూన్ 1వ తేదీ నుంచి రైళ్ల పునరుద్దరణ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా లాక్ డౌన్ పీరియడ్‌లో రైల్వే అందిస్తున్న సేవలు,కోవిడ్-19 నియంత్రణలో రైల్వే పాత్రను రైల్వే అధికారులు వివరించారు.

Recommended Video

Indian Railways To Operate 2,600 Shramik Special Trains In Next 10 Days
రైల్వే డేటా ఇదీ..

రైల్వే డేటా ఇదీ..

రైల్వే డేటా ప్రకారం... ఇప్పటివరకూ అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు 1246 శ్రామిక్ రైళ్లను నడిపారు. అలాగే బీహార్‌కు 804,జార్ఖండ్‌కు 124 రైళ్లు నడిపారు. వలస కూలీలను తరలించిన రాష్ట్రాల్లో అత్యధికంగా గుజరాత్ 759 శ్రామిక్ రైళ్లను ఉపయోగించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో 483 రైళ్లతో మహారాష్ట్ర,291 శ్రామిక్ రైళ్లతో పంజాబ్ ఉన్నాయి. మొత్తంగా 80శాతం రైళ్లు ఉత్తరప్రదేశ్,బీహార్‌లకు చెందిన వలస కూలీలను తరలించేందుకే ఉపయోగించబడ్డాయని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు.

రాబోయే 10 రోజుల్లో..

రాబోయే 10 రోజుల్లో..


జూన్ 1 నుంచి 200 రైళ్లను నడపబోతున్నామని... రాబోయే 10 రోజుల్లో మరో 2600 శ్రామిక్ రైళ్ల ద్వారా 36లక్షల వలస కూలీలను తరలించబోతున్నామని వినోద్ కుమార్ వెల్లడించారు. దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. మే 1వ తేదీ నుంచి శ్రామిక్ రైళ్లను నడుపుతున్నామని.. వలస కూలీలకు ఉచిత నీరు,భోజనం అందజేస్తున్నామని తెలిపారు. శ్రామిక్ రైళ్ల అవసరం ఎన్ని రోజుల వరకు ఉంటే అన్ని రోజులు ఆ రైళ్లు నడుపుతామన్నారు. ఏ రాష్ట్రమైనా తమకు శ్రామిక్ రైళ్లు కావాలని కోరితే.. అందుకు తగినట్టుగా చర్యలు తీసుకుంటామన్నారు.

డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో రైళ్లను పెంచే అవకాశం..

డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో రైళ్లను పెంచే అవకాశం..

గత 4 రోజులుగా సగటున ప్రతీరోజూ 260 శ్రామిక్ రైళ్ల ద్వారా 3లక్షల వలస కూలీలను తరలించామన్నారు. ప్రస్తుతం జూన్ 1వ తేదీ నుంచి నడపబోయే రైళ్లకు సంబంధించిన బుకింగ్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. డిమాండ్ ఎక్కువగా రూట్లలో ఎక్కువ రైళ్లు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రోటోకాల్ ప్రకారం భౌతిక దూరం,పరిశుభ్రతకు సంబంధించి అన్ని రైళ్లు,స్టేషన్లలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏప్రిల్ 1-మే 22 వరకు 9.7మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను గూడ్స్ రైళ్ల ద్వారా తరలించినట్టు చెప్పారు. మార్చి 22 నుంచి 3255 పార్శిల్ స్పెషల్ ట్రైన్స్ నడిపినట్టు తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా పీపీఈ కిట్ల ఉత్పత్తిలోనూ రైల్వే కీలకంగా వ్యవహరించిందన్నారు. 1.2లక్షల పీపీఈ కిట్లతో పాటు 1.4లక్షల లీటర్ల శానిటైజర్‌ను ఉత్పత్తి చేసినట్టు చెప్పారు.

English summary
Railway Board Chairman Vinod Kumar Yadav said that Around 2,600 trains have been scheduled for next 10 days. On an average, 260 Shramik Special trains operated every day for last 4 days, carrying 3 lakh passengers daily, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X